క్రికెట్లో 35 ఏళ్లకు పైబడిన ప్లేయర్లు బ్యాటింగ్, బౌలింగ్ చేసినా ఫీల్డింగ్‌లో అంత చురుగ్గా కనిపించరు. గాయాలు, వయసు ప్రభావంతో మునుపటి స్థాయిలో ఫీల్డింగ్ చేయలేరు. కానీ కొందరు ఆటగాళ్లు దీనికి మినహాయింపు అనే చెప్పాలి. ఫిట్నెస్ను మెయింటెయిన్ చేస్తూ కుర్రాళ్లతో పోటీపడుతుంటారు. అలాంటి వారిలో శిఖర్ ధవన్ ఒకడు.
‘క్యాచెస్ విన్ మ్యాచెస్’ అనే నానుడి క్రికెట్లో బాగా వినపడుతుంది. బౌలింగ్, బ్యాటింగ్‌తో పాటు మ్యాచ్‌లు గెలవడంలో ఫీల్డింగ్ కూడా ఇప్పుడు కీలకంగా మారింది.
భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డేలో అద్భుతమైన దృశ్యం కనిపించింది. మ్యాచ్ మొత్తం పెద్దగా ఏమనిపించలేదు కానీ స్మిత్ పట్టిన క్యాచ్ మాత్రం వావ్ అనేలా ఉంది. ఇంతకీ ఏం జరిగింది?
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్-ఆసీస్ మధ్య తొలి వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఓ స్టన్నింగ్ క్యాచ్ పట్టి ఆసీస్ స్టార్ బ్యాటర్ లబూషేన్ ను పెవిలియన్ కు పంపాడు.
క్రికెట్ లో మిస్టర్ 360 అనగానే అందరూ ఏబీ డివిలియర్స్ గురించే మాట్లాడుకుంటారు. కానీ అతడిని మరిపించేలా సూర్యకుమార్ వెలుగులోకి వచ్చాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ తో అందరూ తన కోసం మాత్రమే మాట్లాడుకునేలా చేశాడు. ఏకంగా ఏబీడీతోనే ప్రశంసలు అందుకున్నాడు. అలాంటి సూర్య బ్యాటింగ్ గురించి అందరికీ తెలుసు. కానీ తనలో బ్యాటర్ మాత్రమే కాదు అంతకు మించిన ఫీల్డర్ ఉన్నాడని కూడా ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తోంది. న్యూజిలాండ్ తో మూడో టీ20లోనూ అలాంటి సీన్ […]
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్ ల హవా నడుస్తోంది. ఓవైపు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, మరోవైపు బిగ్ బాష్ లీగ్ లతో పాటుగా తొలి సారి సౌతాఫ్రికా సైతం టీ20 లీగ్ ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ లీగ్ ల్లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. ఓ వైపు బౌలర్లు, మరోవైపు బ్యాటర్లు తమ సత్తా నిరూపించుకుంటున్నారు. అయితే తామేమీ తక్కువ కాదన్నట్లుగా ఫీల్డర్లు సైతం కళ్లు చెదిరే క్యాచ్ లతో ఈ లీగ్స్ లో దుమ్మురేపుతున్నారు. […]
క్రికెట్ గురించి మనలో చాలామందికి తెలుసు. ఆడటం రాకపోయినా సరే టీవీలో మ్యాచులు చూస్తుంటాం కాబట్టి రూల్స్ కూడా తెలుసు. అయితే కొన్నిసార్లు క్రికెట్ లో అస్సలు ఎక్స్ పెక్టే చేయనివి జరుగుతుంటాయి. వాటిని చూసి అవాక్కవడం పక్కా. ఇప్పుడు కూడా ఓ టీ20 మ్యాచులో అలానే జరిగింది. బౌండరీ లైన దాటి మరీ క్యాచ్ పట్టాడు. కానీ అంపైర్ మాత్రం ఔట్ ఇచ్చాడు. సిక్స్ వెళ్తుందని అనుకున్న షాట్.. క్యాచ్ అయ్యేసరికి బ్యాటర్ షాకయ్యాడు. అసలు […]
కెయిర్న్స్ వేదికగా జరిగిన తొలివన్డేలో ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్ పై 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 232 పరుగులు చేయగా, ఆసీస్ జట్టు 45 ఓవర్లకే లక్ష్యాన్ని చేధించింది. అయితే.. ఈ మ్యాచులో మాక్స్‌వెల్ అందుకున్న క్యాచ్.. మ్యాచ్ కే హైలైట్ గా నిలుస్తోంది. రెప్పపాటులో.. అదీ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు మ్యాక్సీ. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 3 వన్డేల సిరీస్ […]
క్రీడా ప్రపంచంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ అంతా.. ఇంతా కాదు.. తమ అభిమాన జట్టు మ్యాచ్ ఉందంటే చాలు పని పక్కన పెట్టి మరీ మ్యాచ్ చూడ్డానికి వెళ్తారు. ఇటీవల తన ప్రియురాలిని కాదని మరీ మ్యాచ్ చూడ్డానికి వచ్చిన ప్రియుణ్ణి చూశాం. అంత అభిమానం క్రికెట్ అంటే.. ప్రస్తుతం న్యూజిలాండ్– ఐర్లాండ్ మధ్య వన్డే సీరిస్ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు […]
క్రికెట్ లో పాకిస్థాన్ టీమ్ అంటే అనిశ్చితికి మారు పేరు. ఒక్కోసారి ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలను సైతం అవలీలగా ఓడించే ఈ టీమ్.. కొన్నిసార్లు పసికూనల చేతిలో ఘోరంగా ఓడిపోతూ ఉంటుంది. ఇక పాకిస్థాన్ ప్లేయర్స్ ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చేతిలో పడుతున్న సింపుల్ క్యాచ్ లను కూడా నేలపాలు చేసి.. మ్యాచ్ లు ఓడిపోవడంలో వీరితో ఎవ్వరూ పోటీ పడలేరు. అయితే.. గత కొంత కాలంగా పాకిస్థాన్ టీమ్ […]