క్రికెట్ గురించి మనలో చాలామందికి తెలుసు. ఆడటం రాకపోయినా సరే టీవీలో మ్యాచులు చూస్తుంటాం కాబట్టి రూల్స్ కూడా తెలుసు. అయితే కొన్నిసార్లు క్రికెట్ లో అస్సలు ఎక్స్ పెక్టే చేయనివి జరుగుతుంటాయి. వాటిని చూసి అవాక్కవడం పక్కా. ఇప్పుడు కూడా ఓ టీ20 మ్యాచులో అలానే జరిగింది. బౌండరీ లైన దాటి మరీ క్యాచ్ పట్టాడు. కానీ అంపైర్ మాత్రం ఔట్ ఇచ్చాడు. సిక్స్ వెళ్తుందని అనుకున్న షాట్.. క్యాచ్ అయ్యేసరికి బ్యాటర్ షాకయ్యాడు. అసలు క్యాచ్ పట్టలేనేమో అనుకున్న ఫీల్డర్ చాకచక్యంగా క్యాచ్ పట్టేసరికి.. షాకవడం వీక్షకుల వంతైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియా ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్ జరుగుతోంది. తాజాగా సిడ్నీ సిక్సర్స్, బ్రిస్బేన్ హీట్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. బ్యాటింగ్ చేస్తున్న జోర్డాన్ సిల్క్, బంతిని బలంగా గాల్లోకి లేపాడు. తన షాట్ సిక్స్ వెళ్లిపోతుందని ఫిక్స్ అయిపోయాడు. బౌండరీ లైన్ దగ్గరున్న మిచెల్ నెసెర్ అమాంతం ఎగిరి క్యాచ్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే తనని తాను కంట్రోల్ చేసుకోలేక బౌండరీ దాటేశాడు. కానీ ఇక్కడే అతడు చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. బౌండరీ లైన్ దాటేలోపే బంతిని గాల్లోకి విసేరేశాడు. ఆ తర్వాత బౌండరీ లైన్ దాటి బంతిని పట్టేలోపు మళ్లీ తాను గాల్లోకి ఎగిరాడు. తను గ్రౌండ్ ని టచ్ చేయకుండానే మళ్లీ బంతిని బౌండరీ లోపలికి విసిరేశాడు. బౌండరీ లోపలకు వచ్చి క్యాచ్ పట్టాడు. దీంతో అంపైర్ ఔటిచ్చాడు.
ఈ క్యాచ్ విషయంలో అంపైర్ నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో చర్చ షురూ అయింది. కొందరు దాన్ని ఔట్ అంటుంటే.. మరికొందరు సిక్స్ అంటున్నారు. అయితే ఎంసీసీ రూల్స్ ప్రకారం ఇది ఔట్. ఎంసీసీలోని నిబంధనల 19.5.2 ప్రకారం.. ఫీల్డర్ బౌండరీ లైన్ బయట క్యాచ్ అందుకున్నప్పటికీ గ్రౌండ్ టచ్ కాకపోతే అది క్యాచ్. కాకపోతే బౌలర్ బంతిని విసిరిన తర్వాత క్యాచ్ పట్టే టైంలో ఫీల్డర్ బౌండరీ లైన్ లోపల నేలను తాకి ఉండాలి. ఈ రూల్స్ లోబడే.. ఫీల్డర్ క్యాచ్ అందుకోవడంతో.. అంపైర్ ఔటిచ్చాడు. ఇక ఈ క్యాచ్ వల్ల మొత్తం మ్యాచ్ రిజల్టే తారుమారు అయిపోవడం విశేషం. 23 బంతుల్లో 41 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో సిల్క్ పెవిలియన్ చేరడంతో సిడ్నీ సిక్సర్స్ పై బ్రిస్బేన్ హీట్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరి ఈ క్యాచ్ ఔటా నాటాటా? మీ అభిప్రాయాన్ని దిగువన కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
OUT or NOT OUT? pic.twitter.com/evxLhL2hAv
— England’s Barmy Army (@TheBarmyArmy) January 1, 2023