తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా టాపార్డర్ దుమ్ములేపుతోంది. బ్యాటింగ్ పిచ్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ముఖ్యంగా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సెంచరీతో కదం తొక్కాడు. 89 బంతుల్లోనే 11 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆరంభం నుంచి మంచి టచ్‌లో కనిపించిన గిల్.. తన ఇన్నింగ్స్‌లో ఒక్కసారి కూడా లంక ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వకుండా.. అద్భుతమైన క్లాస్ చూపించాడు. పర్ఫెక్ట్ షాట్లతో సెంచరీ సాధించాడు. సెంచరీ మార్క్ దాటిన తర్వాత.. టాప్ గేర్‌లోకి వచ్చిన గిల్.. వరుస ఫోర్లతో లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత ఓవర్‌లో మూడు ఫోర్లు బాది అదరగొట్టాడు. ఇక గిల్‌తో పాటు కింగ్ కోహ్లీ సైతం హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని బ్యాటింగ్ చేస్తున్నాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో.. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నాడు. అందకు తగ్గట్లే.. ఓపెనర్ గిల్‌తో కలిసి రోహిత్ టీమిండియాకు శుభారంభం అందించాడు. ఈ ఇద్దరు కలిసి తొలి వికెట్ 95 పరుగులు జోడించారు. 49 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 42 పరుగులు చేసి రోహిత్ శర్మ.. కరుణరత్నే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత.. గిల్-కోహ్లీ జోడీ లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలోనే కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. తర్వాత బంతికే గిల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. అయితే 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సులతో 116 పరుగులు చేసి గిల్.. రజిత బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 34 ఓవర్లలో 2 వికెట్ మాత్రమే కోల్పోయి 228 పరుగులు చేసింది.. మరో 16 ఓవర్లు మిగిలి ఉండటంతో.. భారీ స్కోర్ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ మ్యాచ్‌లో గిల్ సెంచరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
This is beautiful: Kohli & Gill. pic.twitter.com/q5vHLOaKfR
— Johns. (@CricCrazyJohns) January 15, 2023