టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ఒక తప్పుడు వ్యాఖ్య చేసినందుకు ప్రముఖ కామెంటేటర్ క్షమాపణలు చెప్పాడు. ఇంగ్లండ్ టూర్ తర్వాత లాంగ్ రెస్ట్ తీసుకున్న కోహ్లీ.. ఆసియా కప్‌తో తిరిగి జట్టులోకి వచ్చాడు. కొంతకాలం ఫామ్‌లో లేక పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న కోహ్లీ.. కొంత విశ్రాంతి తీసుకుని మరీ జట్టులోకి వచ్చాడు. దీంతో ఫ్రెష్‌మైండ్‌తో కోహ్లీ ఫామ్ పుంజుకుంటాడని అంతా భావించారు. అందుకుతగ్గట్లే కోహ్లీ కూడా నెట్ సెషన్స్‌లో మంచి టచ్‌లో కనిపించాడు. కానీ.. అనూహ్యంగా విరాట్ కోహ్లీ ఆసియా కప్ దూరమయ్యాడంటూ ఒక వార్త క్రికెట్ ప్రపంచంలో దావానంలా వ్యాపించింది. ఆ మాట చెప్పింది శ్రీలంక ప్రముఖ వ్యాఖ్యాత రోషన్ అబేసింఘే. దీంతో ఆ విషయం నిజమని అంతా అనుకున్నారు.
చాలా కాలం కోహ్లీ ఆట చూడలేకపోయిన అభిమానులు.. కనీసం ఆసియా కప్‌లో అందులోనూ పాక్‌తో మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్‌ను చూడొచ్చని సంబరపడ్డారు. కానీ.. రోషన్ ట్వీట్‌తో ఒక్కసారిగా షాక్ తిన్నారు. కోహ్లీ ఆసియా కప్‌లో ఆడకుంటే.. టీ20 వరల్డ్ కప్‌లో అతనికి చోటు దక్కడం కష్టమవుతుందని కోహ్లీ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. కానీ.. అది తప్పుడు వార్త అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. విరాట్ కోహ్లీ ఆసియా కప్‌కు దూరమయ్యాడని తాను ఫేక్ న్యూస్ చెప్పినట్లు తర్వాత రోషన్ క్షమాపణలు చెప్పడంతో కోహ్లీ ఫ్యాన్స్ శాంతించారు. లేదంటే రోషన్‌ను సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో ఆడుకునేవారు.
ఆదివారం పాకిస్థాన్‌తో జరగబోయే మ్యాచ్‌పైనే విరాట్ కోహ్లీ పూర్తిగా ఫోకస్ పెట్టాడు. చాలా గ్యాప్ తర్వాత బరిలోకి దిగుతున్న కోహ్లీ.. ఎలాంటి ప్రదర్శన చేస్తాడో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోహ్లీ కూడా తన రిథమ్‌ను అందిపుచ్చుకోవడానికి నెట్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఫామ్‌లేమిపై వస్తున్న విమర్శలకు ఫుల్‌స్టాప్ పెట్టడంతో పాటు జట్టుకు ఆసియా కప్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అలాగా చాలా కాలం అందరి ద్రాక్షలా మారిన సెంచరీని సైతం ఆసియా కప్‌లో బాదాలని కోహ్లీ బలం ఫిక్స్ అయినట్లు సమాచారం. మరి కోహ్లీ విషయంలో రోషన్ ఫేక్ ట్వీట్, క్షమాపణలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sorry Virat’s news is fake. Tweet has been deleted.
— Roshan Abeysinghe (@RoshanCricket) August 25, 2022
ఇది కూడా చదవండి: ‘నో హైప్.. నో టెన్షన్..’ ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ పై నోరువిప్పిన హిట్ మ్యాన్!