టీ20 ప్రపంచ కప్ ఆడడానికి వెళ్లి.. అక్కడ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ శ్రీలంక మాజీ క్రికెటర్ గుణతిలకకు కాస్త ఊరట లభించింది. సిడ్నీ కోర్టు అతడికి గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గడిచిన రెండు వారాలుగా బెయిల్ కోసం అతడు చేసిన ప్రయత్నాలు ఫలించినా.. కోర్టు మాత్రం అతడికి షరతులతో కూడిన ఊరటనిచ్చింది. సిడ్నీలోని డౌనింగ్ సెంట్రల్ కోర్టు మెజిస్ట్రేట్ 1,50,000 డాలర్ల పూచీకత్తుతో అతడికి బెయిల్ ఇచ్చారు. అయితే.. ఆ షరతులు వింటే నవ్వు ఆపుకోలేరు.
ప్రస్తుతం జైలులో ఉన్న గుణాతిలక ఆడియో విజ్యువల్ లింక్ ద్వారా కోర్టు వాదనలకు హాజరయ్యాడు. ఈ కేసు విచారణ సమయంలో పోలీసులు అతడికి బెయిల్ ఇవ్వవద్దని మెజిస్ట్రేట్‌ని కోరారు. ఆలా చేస్తే అతడు ఏక్షణంలోనైనా దేశం విడిచివెళ్లే అవకాశం ఉందని, ఫిర్యాదు చేసిన మహిళ ప్రాణాలకు ముప్పు పొంచివుందని వాదనలు వినిపించారు. అయినప్పటికీ.. డౌనింగ్ సెంట్రల్ కోర్టు మెజిస్ట్రేట్ జానెట్ వాహల్‌క్విస్ట్ మంచి మనసుతో అతడికి బెయిల్ మంజూరు చేశారు. ఒకవేళ దనుష్క ఆస్ట్రేలియా పౌరుడు అయి, ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొని ఉంటే అతనికి బెయిల్ ఇచ్చేవాళ్లం కదా! అని అన్నారు.
అయితే అతడు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఆదేశించాడు. ముఖ్యంగా ఈ కేసులో గుణతిలక.. రేప్ చేసిన మహిళను కలిసిన టిండర్ యాప్ జోలికి వెళ్లొద్దని.. ఒకవేళ అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాడు. అలాగే కేసు పూర్తయ్యేవరకూ దేశాన్ని విడిచి వెళ్లరాదని.. 1,50,000 ఆస్ట్రేలియన్ డాలర్ల పూచీకత్తు సమర్పించాలని సూచించారు. అంతేకాకుండా గుణతిలక పాస్ పోర్టును పోలీసులకు సరెండర్ చేయాలని, రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ నిఘా ఉంచాలని ఆదేశించారు. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన కోర్టు దనుష్క కేసు వాదనలు మరోసారి విననుంది.
Strict Bail conditions for Danushka Gunathilaka who was bailed today after spending 11 nights in prison. pic.twitter.com/Okb2fTk2u7
— NewsWire 🇱🇰 (@NewsWireLK) November 17, 2022
గుణతిలక టిండర్ అనే డేటింగ్ యాప్‌లో పరిచయమైన మహిళను ఆత్యాచారం చేశాడనే కేసులో అక్టోబర్ 6న సిడ్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో అతడు శ్రీలంక జట్టుతో కలిసి హయత్ రెజెన్సీ హోటల్‌లో ఉన్నాడు. గుణతిలక శ్రీలంకవరల్డ్ కప్ జట్టులో సభ్యుడు. నమీబియాతి జరిగిన తొలి మ్యాచులో ఆడాడు. ఆ తరువాత గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. కాగా, అత్యాచారం ఆరోపణలతో అరెస్ట్ అయిన దనుష్కని శ్రీలంక బోర్డు అన్ని ఫార్మాట్ల నుంచి ఇప్పటికే తొలగించింది. అతడిపై అత్యాచారం ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇతను నాలుగుసార్లు అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అప్పుడు కూడా నిషేధం ఎదుర్కున్నాడు.