నిన్నటి వరకు రకరకాల ఊహాగానాలు, గందరగోళం మధ్య ఉన్న టీమిండియా ఆటగాళ్లు విమానంలో ఉల్లాసంగా కనిపించారు. వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని తొలగించి, రోహిత్ శర్మకు ఆ బాధ్యతలు అప్పగించడంతో టీమిండియాలో ఒక రకమైన అనిశ్చితి నెలకొంది. దానికి తోడు కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో టీమిండియా సౌతాఫ్రికా పర్యటన ఉంటుందో? లేదో? అనే అనుమానాలు కలిగాయి. ఇలా అన్ని సందేహాలకు, పుకార్లకు తెరదించుతుంది ఒక వీడియో.
From Mumbai to Jo’Burg! 👍 👍
Capturing #TeamIndia‘s journey to South Africa 🇮🇳 ✈️ 🇿🇦 – By @28anand
Watch the full video 🎥 🔽 #SAvINDhttps://t.co/dJ4eTuyCz5 pic.twitter.com/F0qCR0DvoF
— BCCI (@BCCI) December 17, 2021
శుక్రవారం టీమిండియా ఆటగాళ్లు సౌతాఫ్రికాతో మూడు టెస్టు సిరీస్ ఆడేందుకు విమానం ఎక్కారు. అందులో సరదాగా కనిపించారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మ మధ్య సరదా సంభాషణలు జరిగాయి. కోహ్లీ ఎందో అంటుంటే.. పొద్దుపొద్దు ఏంది.. అంటూ ఇషాంత్ అనడం వీడియోలో చూడొచ్చు. ఇలా టీమిండియా ఆటగాళ్లు సరదాగా గడిపిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసింది. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి టీమిండియా ఆటగాళ్ల సరదా సంభాషణలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: బయటికొచ్చిన కోహ్లీ-అనుష్క ముద్దల కూతురు వామికా ఫొటోలు
📍Touchdown South Africa 🇿🇦#TeamIndia #SAvIND pic.twitter.com/i8Xu6frp9C
— BCCI (@BCCI) December 16, 2021