క్రికెట్ లో రికార్డులకు ఆయుష్షు తక్కువ అన్న సామెత మనందరికి తెలిసిందే. ఈ రోజు క్రియేట్ చేసిన రికార్డు రేపు ఉంటుందో లేదో తెలీదు. రేపు బద్దలు కొట్టిన రికార్డు ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలీదు. ఇక రికార్డుల రారాజు అని పేరున్న కింగ్ విరాట్ కోహ్లీ రికార్డునే బ్రేక్ చేశాడు టీమిండియా యంగ్ ప్లేయర్ శుభ్ మన్ గిల్. తాజాగా న్యూజిలాండ్ తో జరుగుతున్న సిరీస్ లో దుమ్మురేపుతున్నాడు ఈ కుర్ర బ్యాటర్. ఇటీవలే కివీస్ తో వన్డే సిరీస్ లో డబుల్ సెంచరీ చేసి పలు రికార్డులు బద్దలు కొట్టిన గిల్.. న్యూజిలాండ్ తో తాజాగా జరిగిన మూడో టీ20లో సెంచరీతో కదంతొక్కాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు గిల్.
శుభ్ మన్ గిల్.. న్యూజిలాండ్ పాలిట సింహ స్వప్నంలా మారాడు. వన్డే సిరీస్ లో ఓ సెంచరీ, డబుల్ సెంచరీ బాది.. టీమిండియా సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేయడంలో కీలక పాత్ర వహించాడు. తాజాగా జరుగుతున్న నిర్ణయాత్మకమైన మూడో టీ20లో సెంచరీతో చెలరేగిపోయాడు శుభ్ మన్ గిల్. కివీస్ బౌలర్లను ఉతికారేస్తూ.. కేవలం 54 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో రికార్డుల రారాజు కింగ్ విరాట్ కోహ్లీ పేరిట ఇప్పటి వరకు ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు గిల్. గతేడాది ఆసియా కప్ లో విరాట్ ఆఫ్ఘనిస్తాన్ పై 61 బంతుల్లో 122 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఇదే ఓ టీమిండియా బ్యాటర్ అంతర్జాతీయ టీ20ల్లో చేసిన అత్యధిక పరుగుల రికార్డు.
తాజాగా గిల్ ఈ రికార్డ్ ను బద్దలు కొట్టాడు. 63 బంతుల్లో 7 సిక్స్ లు, 12 ఫోర్లతో 126 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు గిల్. దాంతో విరాట్ అత్యధిక వ్యక్తిగత రికార్డు తుడిచిపెట్టుకు పోయింది. ఇక గిల్ విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది భారత్. అనంతరం 235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ తడబడింది. భారత బౌలర్ల దాటికి టాపార్డర్ కుప్పకూలింది. 4 ఓవర్లలో 21 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతుంది. భారత బౌలర్లలో పాండ్యా, అర్షదీప్ సింగ్ తలా రెండు వికెట్లు తీశారు. మరి కోహ్లీ రికార్డును గిల్ బ్రేక్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Highest individual score by an Indian in T20I:
Shubman Gill – 126(63)
Virat Kohli – 122(61)
Rohit Sharma – 118(43)— Johns. (@CricCrazyJohns) February 1, 2023
What a knock by Shubman Gill, 126* runs from just 63 balls, the future has started for India.
Take a bow, Prince. pic.twitter.com/xhe6fr3vbF
— Johns. (@CricCrazyJohns) February 1, 2023