టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ స్పిన్నర్ అవతారం ఎత్తాడు. అది కూడా విండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ శైలిని అనుకరిస్తూ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఓపెనర్ బ్యాటర్‌గా ఉన్న గిల్ బౌలింగ్ ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నాడని అనుకుంటున్నారా? ప్రస్తుతం టీమిండియాలో చోటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. తుది జట్టులో ఎవరిని తీసుకోవాలో అర్థంకాక సెలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. ఒక్కో ప్లేస్‌కు ఇద్దరి ముగ్గురు ఆటగాళ్ల పోటీ పడుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఒక్క బ్యాటింగ్‌కే పరిమితం అయితే అవకాశాలు దక్కవని భావిస్తున్న గిల్.. పార్ట్‌టైమ్ బౌలర్‌గా కూడా మారాలనుకుంటున్నాడు. ఇలా అయితే జట్టుకు అవసరమైన సమయంలో పార్ట్‌టైమ్ బౌలర్‌గా కూడా ఉపయోగపడతాడని ఓపెనింగ్ బ్యాటర్ కమ్ స్పిన్నర్‌గా తనకు వెయిటేజ్ పెరుగుతుందని గిల్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ లాంటి బౌలింగ్ టెక్నిన్‌ను ప్రాక్టీస్ చేస్తున్నాడు. అలాగే టీ20 క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌కు భారీ డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. జట్టులోని ప్రధాన బౌలర్లు విఫలమైన చోట ఒకటి రెండు ఓవర్లను భర్తీ చేయగలిగితే టీమ్‌కు సపోర్ట్‌గా ఉంటుంది.
కాగా ఇటీవలే వెస్టిండీస్‌తో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో ఓపెనర్‌గా సత్తా చాటిన గిల్.. ఆ ప్రదర్శనతో జింబాబ్వే పర్యటనకు ఎంపికయ్యాడు. ఇక్కడ సత్తా చాటి టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కించుకోవాలనే దృఢ నిశ్చయంతో ఉన్నాడు. ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో మిడిలార్డర్‌లో ఆడనున్న గిల్.. పార్ట్ టైమ్ బౌలర్‌గా రాణించి భారత జట్టులోకి రావాలనుకుంటున్నాడు. ప్రస్తుతం నెట్స్‌లో గిల్ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరి గిల్ బౌలింగ్ ప్రాక్టీస్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
SHUBMAN NARINE GILL pic.twitter.com/hEBbIgsdb0
— depressed gill fan (@ShubmanGillFan) August 17, 2022
ఇది కూడా చదవండి: అయ్యర్‌తో పార్టీకి వెళ్లిన చాహల్ భార్య.. ఫోటోలు బయటపెట్టిన సూర్యకుమార్ యాదవ్!