7 ఓవర్లు వేశాడు.. అన్నీ మెయిడెన్ ఓవర్లే, ఒక్కటంటే ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. పైగా 7 వికెట్లు తీసుకున్నాడు. దశాబ్దకాలంగా బౌలింగ్ వేస్తున్నా.. ఇప్పటికీ మిస్టరీ స్పిన్నరే.. బ్యాటర్లకు సింహస్వప్నమే.. అతనే సునీల్ నరైన్. తాజాగా మరో అద్భుతం చేశాడు.
ఏ క్షణాన భారతదేశం IPL టోర్నీని ప్రారంభించిందో.. అప్పటి నుంచి వరల్డ్ క్రికెట్ చరిత్ర మారిందనే చెప్పాలి. ఐపీఎల్ టోర్నీని చూసి చాలా దేశాలు ఇప్పటికే తమతమ దేశాల్లో టీ20లను, టీ10 టోర్నీలను ప్రారంభించాయి. తాజాగా మరో దేశం టీ20 లీగ్ కు తెరలేపనుంది. యూఏఈ ఇంటర్నేషనల్ టీ20 లీగ్ తొలి సీజన్ ను వచ్చే సంవత్సరం జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. ఇక ఈ టోర్నీల పుణ్యమాని ఎంతో మంది టాలెంటెడ్ ఆటగాళ్లు వెలుగులోకి […]
మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్ కప్ 2022 సంగ్రామం మొదలుకానుంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16 నుంచి గ్రూప్ స్టేజ్ పోటీలు 22 నుంచి అసలు సిసలైన సూపర్ 12 పోటీలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీమిండియాతో పాటు పలు దేశాల క్రికెట్ బోర్డులు టీ20 వరల్డ్ కప్ కోసం స్క్వౌడ్‌ను ప్రకటించాయి. అలాగే వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా బుధవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. టీ20 క్రికెట్‌కు […]
కరేబియన్ వీరుడు, సిక్సర్ల కింగ్, యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఎలాంటి విధ్వంసకర ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన రోజు ఎలాంటి బౌలర్‌నైనా చిత్తుచిత్తుగా కొట్టే క్రిస్ గేల్.. బౌలింగ్‌తోనూ మ్యాజిక్ చేయగలడు. పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా వెస్టిండీస్‌తో పాటు తనాడిన చాలా ప్రాంచైజ్ జట్లకు గేల్ బ్యాట్, బాల్‌తోనూ సేవలందించాడు. తాజాగా తన బౌలింగ్ గురించి మాట్లాడుతూ.. తానో గొప్ప ఆఫ్ స్పిన్నర్‌నని, ముత్తయ్య మురళీథరన్ కూడా తనకు పోటీ రాలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. […]
టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ స్పిన్నర్ అవతారం ఎత్తాడు. అది కూడా విండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ శైలిని అనుకరిస్తూ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఓపెనర్ బ్యాటర్‌గా ఉన్న గిల్ బౌలింగ్ ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నాడని అనుకుంటున్నారా? ప్రస్తుతం టీమిండియాలో చోటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. తుది జట్టులో ఎవరిని తీసుకోవాలో అర్థంకాక సెలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. ఒక్కో ప్లేస్‌కు ఇద్దరి ముగ్గురు ఆటగాళ్ల పోటీ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఒక్క […]
ఐపీఎల్ 2022లో బుధవారం కోల్‌కత్తా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య సూపర్ థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచులో ఐదో బంతికి రింకూ సింగ్ క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాక.. నాన్ స్ట్రైక్ లో ఉన్ననరైన్ స్ట్రైక్ తీసుకోకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎందుకు నరైన్ స్ట్రైక్ తీసుకోలేదంటూ అందరూ ప్రశ్నిస్తున్నారు. అయితే.. […]
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతోనే కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రపంచ క్రికెట్‌లో తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రికార్డు టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్‌సింగ్ పేరిట ఉంది. మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో యువీ కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు. ఇప్పటి వరకు అదే ప్రపంచ రికార్డు. ఇప్పుడు తాజా సునీల్ నరైన్ ఆడిన తుపాన్ […]