టాక్ ఆఫ్‌ది క్రికెట్ టౌన్‌గా మారిన పేరు శ్రేయస్ అయ్యర్. అద్భుతమైన బ్యాటింగ్‌తో, చూడచక్కని షాట్లతో ఏకంగా మూడు మ్యాచ్‌లలో వరుసగా అర్థసెంచరీలు బాది అజేయంగా నిలిచిన క్రికెటర్. అందుకే ప్రస్తుతం టీమిండియా సంచలనంగా మారాడు ఈ యువ ఆటగాడు. ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చిన అయ్యర్ భారత్ జట్టులో మాత్రం స్థానం సుస్థిరం చేసుకునేందుకు చాలానే సమయంలో తీసుకున్నాడు. కొన్ని సార్లు ఫెయిల్ అయినా మరికొన్ని సార్లు గాయాలతో వెనుకబడ్డాడు. కానీ గాయం తర్వాత టెస్టుల్లో అరంగేట్రం చేసి తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాదేశాడు. ఇప్పుడు తాజాగా శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో సంచలనం సృష్టించాడు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ అయ్యర్ నామజపం చేస్తున్నారు. తన బ్యాటింగ్‌తో లంక బౌలర్లకు చుక్కలు చూపించిన ఆటగాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
శ్రేయస్ అయ్యర్ పూర్తి పేరు శ్రేయస్ సంతోష్ అయ్యర్. 1994 డిసెంబర్ 6 తేదీన ముంబైలోని చెంబురాలో జన్మంచాడు. సంతోష్ అయ్యర్, రోహిణి అయ్యర్.. శ్రేయస్ తల్లిదండ్రులు. శ్రేష్ట అనే చెల్లి కూడా ఉంది. అయ్యర్ తండ్రి ఒక బిజినెస్‌మెన్. శ్రేయస్‌కు చిన్నతనంలోనే క్రికెట్‌పై ఆసక్తి ఉండేది. ఇది గమనించిన తండ్రి.. శ్రేయస్‌ను క్రికెట్ వైపు ప్రొత్సహించాడు. ముంబైలోని డాన్ బాస్కో హైస్కూల్‌లో చదువుకున్న శ్రేయస్.. ఇంటర్ క్రికెట్ టోర్నీలో మెరిశాడు. ఇంటర్ తర్వాత.. శ్రేయస్ టీమిండియా మాజీ ఆటగాడు ప్రవీణ్ ఆమ్రె క్రికెట్ అకాడమీలో చేరాడు. ముంబైలోని ఆర్‌ఏ డిగ్రీ కాలేజ్‌లో చేరి గ్రాడ్యుయేషన్ లెవెల్ క్రికెట్‌లో పరుగుల వరదపారించేవాడు. 2014లో డొమెస్టిక్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు అయ్యర్. ముంబై లిస్ట్ ఏ జట్టులోకి అరంగేట్రం చేశాడు. అయ్యర్‌ను అప్పట్లో అతని సహచర ఆటగాళ్లు యంగ్ వీరూ అని అనేవారు. ఇక అదే ఏడాది విజయ్ హజారే ట్రోఫీలో 54.60 సగటుతో 273 పరుగులు సాధించాడు. ఆ తర్వాత యూకే టూర్‌కు కూడా వెళ్లిన అయ్యర్ ఏకంగా 99 సగటుతో మూడు మ్యాచ్‌లలో 297 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తొలుత రెండు మ్యాచ్‌లు విఫలం అయినా.. అప్పటి ముంబై రంజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్‌ను బ్యాక్ అప్ చేశాడు. దీంతో తర్వాతి మ్యాచ్‌లలో రెచ్చిపోయిన అయ్యర్ 50.56 సగటుతో 809 పరుగులు చేశాడు. వాటిలో రెండు సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. రంజీలో శ్రేయస్ అద్భుత ప్రదర్శనతో 2015 ఐపీఎల్ వేలంలో శ్రేయస్‌ను 2.6 కోట్లకు అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్ దక్కించుకుంది. ఇక్కడితో శ్రేయస్ దశ తిరిగిపోయింది. ఐపీఎల్ అరంగేట్రం సీజన్‌లోనే ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఆ సీజన్‌లో చేతివేళ్ల గాయంతోనే ఆడిన శ్రేయస్ అదరగొట్టాడు. ఇక 2015 రంజీ ట్రోఫీలో అయితే శ్రేయస్ విజృంభించాడు. ఏకంగా 73.39 సగటుతో 1321 పరుగులు చేశాడు. 2017లో ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్ టెస్టు మ్యాచ్ ఆడేందుకు ఎంపికైన అయ్యర్.. ఆ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో అదరగొట్టి.. టెస్టు సిరీస్ ఆడేందుకు కూడా ఎంపికయ్యాడు. కానీ ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం దక్కలేదు. అదే ఏడాది న్యూజిలాండ్‌తో టీ20, శ్రీలంకతో వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
Shreyas Iyer brings up his 5️⃣th T20I fifty from just 30 balls 🔥👏#ShreyasIyer #INDvSL pic.twitter.com/NL5qUuUCVO
— CRICKET VIDEOS 🏏 (@AbdullahNeaz) February 26, 2022
ఇక ఐపీఎల్‌లో 2018 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్‌గా మారాడు. 2020 సీజన్‌లో ఢిల్లీని ఐపీఎల్ ఫైనల్‌కు చేర్చాడు అయ్యర్. ఇలా ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా కూడా అయ్యర్ ఎదిగాడు. కానీ 2021లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గాయపడ్డ అయ్యర్.. ఆ తర్వాత ఢిల్లీ కెప్టెన్సీ కూడా పోయింది. కానీ ఆటగాడిగా, కెప్టెన్‌గా అయ్యర్‌కు మంచి డిమాండ్ ఉంది. అందుకే ఇటివల బెంగుళూరులో జరిగిన మెగావేలంలో కోల్‌కత్తా నైట్ రైడర్స్ అయ్యర్‌ను ఏకంగా రూ.12.25 కోట్లకు దక్కించుకుంది. 2022 ఐపీఎల్ సీజన్‌లో అయ్యర్ కేకేఆర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. తాజాగా శ్రీలంకతో సిరీస్‌లో మూడు వరుస హాఫ్ సెంచరీలతో అదరగొట్టన అయ్యర్ టీమిండియా మిడిల్డార్‌కు వెన్నుముకలా మారనున్నాడు. మరి అయ్యర్ లైఫ్ స్టోరీ, బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.Shreyas Iyer vs Sri Lanka in the recently concluded T20I series.
1 – David Warner
2 – Shreyas Iyer
& he was the only Indian to score 200+ runs in a 3 match T20I series.
Shreyas Iyer vs Sri Lanka in the recently concluded T20I series.
Only Two players scored 3 unbeaten 50+ Scores in a 3 match T20I series:
1 – David Warner
2 – Shreyas Iyer& he was the only Indian to score 200+ runs in a 3 match T20I series.#ShreyasIyer #Shreyas #INDvSL pic.twitter.com/edzA687qUM
— Vtrakit Cricket (@Vtrakit) February 28, 2022