టీమిండియాలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. మన జట్టులోని బ్యాచిలర్ క్రికెటర్లు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పుడు మరో భారత ప్లేయర్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. అతడు ఎవరంటే..?
ప్రస్తుతం క్రికెట్లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నట్లే ఉంది. టీమిండియాతో పాటు వివిధ జట్లకు చెందిన స్టార్ క్రికెటర్లు మ్యారేజ్ చేసుకుంటున్నారు. రాబోయే నెలల్లో ఐపీఎల్‌తో పాటు వన్డే, టీ20 ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నమెంట్లు ఉండటంతో పెళ్లిబాట పడుతున్నారు. ఇటీవలే భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ ఓ ఇంటివాడయ్యాడు. ప్రేయసి అతియా శెట్టిని పెళ్లాడాడు. ఆ తర్వాత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు మరో టీమిండియా క్రికెటర్ ఈ లిస్టులో చేరనున్నాడు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. మిథాలీ పారుల్కర్‌తో శార్దూల్ వివాహం సోమవారం గ్రాండ్‌గా జరగనుంది.
శార్దూల్ ఠాకూర్, మిథాలీ పారుల్కర్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ఒకరికొకరు చాన్నాళ్లుగా తెలుసు. పెద్దల అంగీకారంతో 2021 నవంబర్‌లో శార్దూల్ ఠాకూర్ – మిథాలీ పారుల్కర్ నిశ్చితార్థం జరిగింది. ఎంగేజ్మెంట్లో శార్దూల్ – మిథాలీ చేసిన డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకుంది. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. వాస్తవానికి గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాతే వీళ్ల పెళ్లి జరగాల్సింది. కానీ కొన్ని కారణాల కారణంగా పోస్ట్‌పోన్ అయింది. అయితే మొత్తానికి ఫిబ్రవరి 27న ఈ లవ్లీ పెయిర్ మూడుముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. వీరి వివాహ వేడుకలు ఇప్పటికే ఆరంభమయ్యాయి. హల్దీ వేడుక ఘనంగా జరిగింది. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
क्रिकेटपटू शार्दुल ठाकूरने आपल्या हळदीच्या कार्यक्रमात झिंगाट गाण्यावर धरला ठेका#ShardulThakur #Cricket pic.twitter.com/eWZi51MDIu
— Mumbai Tak (@mumbaitak) February 25, 2023
Halad lagaliii @imShard 🥳💃🏻💛#ShardulThakur #Haldi #WeddingSoon pic.twitter.com/KqoAdrgUKz
— Kasturi (@missgeminita) February 24, 2023