క్రీడా ప్రపంచంలో ఏన్నో మైలురాళ్లు అధిగమించినప్పటికీ చివరికి ఆటకు వీడ్కోలు పలకాల్సిన సమయం వస్తుంది. ఆ సమయంలో క్రీడా కారులు భావోద్వేగానికి గురికావడం సర్వసాధారణం. ఆ టైమ్ లోనే తమకు సంబంధించిన అనేక విషయాలను వాళ్లు కన్నీటితో అభిమానులతో పంచుకుంటారు. తాజాగా యూఎస్ ఓపెన్ మూడో రౌండ్ లో అమెరికా స్టార్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ తర్వాత సెరెనా తీవ్ర భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
సెరెనా విలియమ్స్.. టెన్నిస్ క్రీడా ప్రపంచంలో ఎన్నోఉన్నత శిఖరాలను అధిరోహించింది. దాంతో ఆమె ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. అయితే సెరెనా గతంలో ఓ ప్రకటన చేసింది. అదేంటంటే.. యూఎస్ ఓపెన్ తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతానని సెరెనా వెల్లడించింది. ఈ నేపథ్యంలో తా జాగా యూఎస్ ఓపెన్ మూడో రౌండ్ లో క్రొయేషియా క్రీడాకారిణి అజ్లా టోమ్ జనోవిక్ చేతిలో5-7, 7-6 ,1-6 తేడాతో పరాజయం చెందింది. ఈ మ్యాచ్ అనంతరం సెరెనా తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ఈ క్రమంలో రిటైర్ మెంట్ నిర్ణనయంపై మళ్లీ ఆలోచన చేసే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు.. “మీకు ఎప్పటికీ తెలియక పోవచ్చు” అంటూ చెప్పుకొచ్చింది.
ఇక తన కుటుంబం గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుంది. “నా సోదరి వీనస్ లేకపోతే నేను ఇక్కడ ఉండే దాన్నే కాదు.. అందుకే వీనస్ కు ధన్యవాదాలు చెబుతున్నా.. వీనస్ లవ్ యూ. నా ఈ ప్రయాణానికి నా తల్లిదండ్రులే కారణం.. నా ప్రతీ ఘనతకు వారే అర్హులు. ఇక నా కంట్లోంచి వచ్చే నీళ్లు కన్నీళ్లు కాదు బహుశా ఆనందభాష్పాలు అనుకుంటున్నా” అంటూ తన మనసులోని తియ్యనైన బాధతో కూడిన సంతోషాన్ని పంచుకుంది. ఇక సెరెనా న్యూయార్క్ లోని అర్థర్ ఆష్ స్టేడియం నుంచి నిష్క్రమించే క్రమంలో స్టేడియం మెుత్తం స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి ఘనంగా సత్కరించింది.
సెరెనా వారి అభిమాన్నాన్ని స్వీకరిస్తూ చేయి ఊపుతూ.. అభివాదం చేసింది. ఏది ఏమైనప్పటికీ సెరెనా లాంటి దిగ్గజ క్రీడాకారిణి ఆటకు వీడ్కొలు పలకడం చాలా బాధాకరమైన విషయం. ఇక తన 27 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో ఎన్నోరికార్డులను సెరెనా సాధించింది. చివరిగా గెలుపుతో తన ఆటకు వీడ్కొలు పలకాలని భావించిన సెరెనాకు తీవ్ర నిరశే ఎదురైంది. మరి సెరెనా ఆటకు వీడ్కొలు పలకడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A speech worth of the 🐐@serenawilliams | #USOpen pic.twitter.com/0twItGF0jq
— US Open Tennis (@usopen) September 3, 2022
Words cannot describe what #Serena has meant to us all. pic.twitter.com/a4YvBgNhOL
— US Open Tennis (@usopen) September 3, 2022