టీ20 వరల్డ్ కప్ 2021 లో భాగంగా టీమిండియాపై పాకిస్తాన్ ఘన విజయం సాధించిన విజయం తెలిసిందే. ఎంతో అట్టహసంగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా గెలవాలని అభిమానులు కోరుకున్నారు. కానీ వారి ఆశలు నెరవేరలేదు. దీంతో అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన టీమిండియా క్రికెటర్ ల పై కొంతమంది నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మరీ ముఖ్యంగా భారత స్విమ్ బౌలర్ మహ్మద్ షమీపై తిట్ల పురాణాన్ని అందుకుంటున్నారు.
ఇలా షమీపై చేస్తున్న ట్రోలింగ్ పై ఇటు రాజకీయ నాయకుల నుంచి అటు మాజీ క్రికెట్ దిగ్గజాల వరకు ప్రతీ ఒక్కరు మహ్మద్ షమీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అయితే తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ షమీకి మద్దతు పలుకుతు ట్విట్టర్ లో స్పందించాడు. మేము ఇండియాకు మద్దతిచ్చినప్పుడు, టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే ప్రతీ ఆటగాడికి మద్దతిస్తామని తెలిపాడు. షమీపై అనవసరంగా ట్రోల్ చేస్తున్నారని అది మంచి పద్దతి కాదంటూ ఫైర్ అయ్యాడు. మహ్మద్ షమీ నిబద్ధత కలిగిన ప్రపంచ స్థాయి బౌలర్ అని అతను టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడని సచిన్ తెలిపాడు.
When we support #TeamIndia, we support every person who represents Team India. @MdShami11 is a committed, world-class bowler. He had an off day like any other sportsperson can have.
I stand behind Shami & Team India.
— Sachin Tendulkar (@sachin_rt) October 25, 2021