28 ఏళ్ల భారతీయుల నిరీక్షణ. రిటైర్మెంట్ లోపు ఎలాగైనా ప్రపంచ కప్ తేవాలన్న కల అప్పటి కెప్టెన్ గా ఉన్న సచిన్ ది. భారతీయుల నిరీక్షణను, సచిన్ కలను సాకారం చేసినటువంటి వీరుడు, పోరాట యోధుడు యువరాజ్ సింగ్. గ్రౌండ్ లో రక్తం కక్కుతున్నా కూడా భారత్ కి ప్రపంచ కప్ తేవాలన్న సంకల్పంతోనే ఆడుతూ వచ్చారు. పోరాడుతూ వచ్చారు. టోర్నీకి ముందుగానే భారత్ కి ప్రపంచ కప్ తెస్తామని ప్రకటించిన యువరాజ్.. చెప్పినట్టుగానే 2011లో భారత్ కి ప్రపంచ కప్ తీసుకొచ్చారు. 2011 వన్డే ప్రపంచ కప్ అంటే గుర్తొచ్చేది యువరాజ్ సింగ్ విధ్వంసం అనేలా ఒక చరిత్రని లిఖించారు. బ్యాటింగ్ తోనే కాకుండా.. బౌలింగ్ తో కూడా ప్రత్యర్థి జట్ల మీద విరుచుకుపడ్డారు.
టోర్నీలో 8 ఇన్నింగ్స్ లలో 362 పరుగులు చేసి.. అద్భుతమైన బౌలింగ్ తో 15 వికెట్లు తీసి.. ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా అందుకున్నారు. అద్భుతమైన ఆట తీరుతో భారత్ కి ప్రపంచ కప్ ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అయితే యువీ ఇంతలా విరుచుకుపడడం వెనుక సచిన్ టెండూల్కర్ ఇచ్చిన మోటివేషన్ ఉంది. సచిన్ మోటివేషన్ ఎందుకిచ్చారో తెలుసుకోవాలంటే అసలు ఆ సమయంలో యువరాజ్ కి ఏమైందో తెలుసుకోవాలి. 2011లో ప్రపంచ కప్ వచ్చిన తర్వాత యువరాజ్ సింగ్ క్యాన్సర్ బారిన పడ్డ విషయం మనకి తెలిసిందే. ఒక మ్యాచ్ లో రక్తం కక్కుకుని మరీ ఆడి భారత్ ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
అయితే యువరాజ్ మ్యాచ్ లు ఆడుతున్నప్పుడే ఈ క్యాన్సర్ ఉందని చాలా మందికి తెలియదు. కానీ క్యాన్సర్ వల్ల యువీ ఎనర్జీ లెవల్స్ డ్రాప్ అవ్వడాన్ని ముందుగా గుర్తించింది సచినే. మొదటి మ్యాచ్ తర్వాత యువరాజ్ ఎనర్జీ లెవల్స్ తగ్గిపోతుండడాన్ని సచిన్ ముందుగానే గుర్తించి.. హోటల్ లో తన రూమ్ కి పిలిచారు. యువరాజ్ సింగ్ ఎనర్జీ లెవల్స్ తగ్గుతుండడాన్ని తాను స్వయంగా చూశానని సచిన్ వెల్లడించారు. ఆ సమయంలో యువరాజ్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఎవరికీ తెలియదు. అయితే ఈ విషయంలో యువరాజ్ ని హెచ్చరించారట. టీమ్ లో ప్రతీ ఒక్కరి బ్యాటింగ్ ని గమనిస్తుండడం సచిన్ అలవాటు.
ఈ క్రమంలో యువరాజ్ సింగ్ ఎనర్జీ లెవల్స్ పడిపోతూ రావడాన్ని గమనించిన సచిన్.. తన రూమ్ కి పిలిచారు. యువరాజ్ సింగ్ రూమ్ కి వెళ్ళగానే డిన్నర్ చేద్దామని సచిన్ అన్నారు. డిన్నర్ అయ్యాక యువరాజ్ వెళ్లబోతుంటే.. అతనికి ఒక విషయం చెప్పారట సచిన్. “చూడు యువీ, మొదటి మ్యాచ్ తర్వాత నీ ఎనర్జీ తగ్గింది. నీకు కొన్ని గోల్స్ పెడతాను. ముందు ఫీల్డింగ్ గోల్స్ పెడతాను. నువ్వు చాలా అద్భుతమైన అథ్లెటిక్ ఫీల్డర్ వి. కానీ నీ ఎనర్జీ పడిపోతుండడం నేను గమనించాను. రేపటి నుంచి మనం సెపరేట్ గా ప్రాక్టీస్ సెషన్స్ పెట్టుకుందాం. నేను నీ ఎనర్జీ లెవల్స్ ని పెంచగలనేమో చూస్తాను. ఇలా చేస్తే నీ గ్రాఫ్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ విషయంలో నాది గ్యారంటీ. నువ్వు కష్టపడు, ఫలితం ఖచ్చితంగా వస్తుంది. సరైన సమయంలో సరైన ఆట తీరు ప్రదర్శించడం ముఖ్యం” అని సచిన్ చెప్పారు.
తన మాటలకు యువరాజ్ సింగ్ ప్రాధాన్యత ఇచ్చారని, ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేసామని సచిన్ అన్నారు. ఆ టోర్నీలో యువరాజ్ సింగ్ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నారని, ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచి.. భారత జట్టుకి ప్రపంచ కప్ ని అందించారని వెల్లడించారు. కోట్ల మంది అభిమానుల కలని నిజం చేసిన యువరాజ్ సింగ్.. ఆ తర్వాత క్యాన్సర్ తో పోరాడుతున్నట్లు తెలిసిందని సచిన్ చెప్పుకొచ్చారు. అలా సచిన్ డాక్టర్ల కంటే ముందుగానే యువరాజ్ సింగ్ అనారోగ్యాన్ని గుర్తించి.. అతనిలో ధైర్యాన్ని నింపారు. ఆ ధైర్యంతోనే యువరాజ్.. 2011 లో భారత జట్టుకి ప్రపంచ కప్ ని అందించారు.
సచిన్ కెరీర్ లో ప్రపంచ కప్ ఉండాలన్న కసితో, ఈ వరల్డ్ కప్ ఆడానని చెప్పిన యువరాజ్.. క్యాన్సర్ తో పోరాడి తిరిగి భారత జట్టులో చోటు సంపాదించుకున్నారు. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో క్యాన్సర్ బారిన పడడం వల్ల యువీ కెరీర్ గ్రాఫ్ దెబ్బతింది. రిటైర్మెంట్ తర్వాత సచిన్ కెప్టెన్సీలో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టోర్నీలో యువరాజ్ పాల్గొని.. రెండు సీజన్స్ లో ఇండియా లెజెండ్స్ కి టైటిల్ అందించడంలో తన వంతు పాత్ర పోషించారు.