సాధారణంగా తండ్రి ఏ వృత్తిని ఎంచుకుంటే కొడుకు సైతం అదే వృత్తిని చేపట్టాలని చూస్తుంటాడు. ఇది అందరికి వర్తించదు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో తండ్రి హీరో అయితే.. కొడుకు కూడా హీరోగా వెండితెరపై అరంగేట్రం చేస్తాడు. ఇదే ఆచారాన్ని కొంత మంది క్రీడా దిగ్గజాల కొడుకులు కూడా పాటించారు. ప్రస్తుతం అదే కోవలోకి వచ్చాడు టీమిండియా క్రికెట్ గాడ్ సచిన్ కొడుకు అర్జున్ టెండుల్కర్. తండ్రి బాటలోనే నడుస్తూ.. ఇప్పుడిప్పుడే జాతీయ జట్టువైపు అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ప్రారంభం అయిన రంజీ ట్రోఫీలో తొలి మ్యాచ్ లోనే శతకంతో కదం తొక్కాడు అర్జున్. ఈ సందర్భంగా కొడుకు సెంచరీ పై భావొద్వేగ పూరిత మాటలు మాట్లాడాడు సచిన్. మరిన్ని వివరాల్లోకి వెళితే..
అర్జున్ టెండుల్కర్.. సచిన్ కొడుకు గా క్రీడా ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. కానీ క్రికెట్ లో రాణించాలి అంటే సచిన్ కొడుకు అన్న పేరు ఒక్కటే సరిపోదు.. అనుకున్నాడో ఏమో, తన తొలి మ్యాచ్ లోనే భారీ సెంచరీతో అందరికి ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 210 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న గోవా జట్టుకు.. 7వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి సెంచరీతో భారీ స్కోర్ ను అందించాడు. తొలి ఇన్నింగ్స్ లో 207 బంతులు ఎదుర్కొన్న అర్జున్ 120 పరుగులు చేశాడు. దాంతో గోవా భారీ స్కోర్ ను సాధించింది. ఇక ఈ సెంచరీపై సచిన్ తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో స్పందించాడు. ఇన్ఫోసిస్ స్థాపించి 40 ఏళ్లు గడిచిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సచిన్ హాజరయ్యాడు. తన కొడుకు సెంచరీ గురించి హోస్ట్ ప్రశ్నించగా ఈ విధంగా స్పందించాడు.
“క్రికెట్ లో రాణించడం అంత ఈజీకాదు. ఇదే విషయాన్ని నేను అర్జున్ కు చెప్పాను. సచిన్ కొడుగ్గా అర్జున్ పై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. నా తొలి మ్యాచ్ ఆడేటప్పుడు నాపై ఇంత ఒత్తిడి ఉండేది కాదు. అర్జున్ ఎక్కడి వెళ్లినా ఇతడు సచిన్ కొడుకు అనే ముద్ర ఉంటుంది. అది చాలా ఒత్తిడి తో కూడుకున్నది. ఇలాంటి ఒత్తిడిలో సైతం అర్జున్ సెంచరీ చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అర్జున్ అందరిలాంటి కొడుకు కాదు.. అతడు సాధారణ పిల్లల్లా తన బాల్యాన్ని గడపలేదు” అంటూ సచిన్ ఈ కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు.
ఇక అతడు నైట్ వాచ్ మెన్ గా బ్యాటింగ్ కు దిగినప్పుడు 4 పరుగుల వద్ద ఉన్నప్పుడు నేను సెంచరీ మీద ఫోకస్ పెట్టు అని సలహా ఇచ్చాను. ఎంత కొడితే ఫైటింగ్ స్కోర్ అవుతుందో అర్జున్ కు చెప్పాను అని సచిన్ తెలిపాడు. ఇక అతడు సచిన్ కొడుకు కావడంతో తీవ్రమైన ఒత్తిడి కూడా ఉంటుందని నేను నా రిటైర్మెంట్ టైమ్ లోనే చెప్పాను. ముందు అతడిని క్రికెట్ ను ప్రేమించనివ్వండి, అర్జున్ పై ఒత్తడి పెంచొద్దు అని వారికి సూచించానని సచిన్ ఈ కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు. అర్జున్ క్రికెట్ పరంగా నాకంటే ఎక్కువగా రోహన్ గవాస్కర్ తో ఎక్కువగా క్లోజ్ గా ఉంటాడని సచిన్ తెలిపాడు.
Sachin Tendulkar’s reaction to Arjun Tendulkar’s hundred on Ranji debut!pic.twitter.com/OOXK6zsXa1
— Pavan Kumar Allada (@pavankumar_apk) December 16, 2022