టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్‌తోనే కాదు.. మాటతో కూడా అదిరిపోయే సమాధానం చెప్పగలడు. దాన్ని మరోసారి రుజువుచేశాడు. శుక్రవారం మొహాలీ వేదికగా శ్రీలంకతో తొలి టెస్టు మ్యాచ్‌తో రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కెరీర్‌లో 100వది. దాంతో ఈ టెస్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం వర్చువల్‌గా మీడియాతో సమావేశమయ్యాడు. ఈ కాన్ఫరెన్స్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే బదులిచ్చాడు. వాళ్ల లోపాన్ని వారే బయటపెట్టుకోవడంతో రోహిత్ వేసిన పంచ్‌కు అందరూ నవ్వుకున్నారు.
ఈ సందర్భంగా జర్నలిస్ట్‌లు అడిగిన ప్రతీ ప్రశ్నకు బదులిచ్చాడు. విరాట్ కోహ్లీ 100వ టెస్ట్ నేపథ్యంలో అతనికి ఈ మ్యాచ్‌ను స్పెషల్‌గా మారుస్తామని తెలిపాడు. ఇదో అత్యుత్తమమైన ఘనత అంటూ అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ క్రమంలోనే ఓ జర్నలిస్ట్ .. మీరు మైదానం బయట మ్యాచ్ ఆడుతున్నారా? అసలు పిచ్, టీమ్ కాంబినేషన్ గురించి మాట్లాడటం లేదని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు రోహిత్ తనదైన శైలిలో బదులిచ్చాడు. ‘మీలో ఒక్కరు కూడా పిచ్, క్రౌడ్, టీమ్ కాంబినేషన్స్ గురించి అడగడం లేదు. మీరు అడిగిన ప్రశ్నలకే సమాధానం చెబుతున్నాను. అసలు ఒక్కటైన సరైన ప్రశ్న అడగడం లేదు.. అది కూడా నాకు మంచిదే అంటూ చురకలు అంటించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరి జర్నలిస్టులకు రోహిత్ ఇచ్చిన కౌంటర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#TeamIndia Captain @ImRo45 at his hilarious best in the press conference 😄😄#INDvSL | @Paytm pic.twitter.com/0tw6EPFg6V
— BCCI (@BCCI) March 3, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.