ప్రస్తుతం భారతదేశం రెండు శుభవార్తలతో పట్టలేని సంతోషంతో ఊగిపోతుంది. ఒక వైపు ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం.. మరోవైపు క్రికెట్‌లో టీమిండియాకు అందిన గుడ్‌న్యూస్‌తో ఇండియా సంబురాల్లో మునిగిపోయింది.
ప్రస్తుతం దేశం మొత్తం ఆస్కార్ ఫీవర్‌తో ఊగిపోతుంది. దేశం గర్వించదగ్గ సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఆ పాటకు సాహిత్యాన్ని అందించిన చంద్రబోస్, సంగీతం అందించిన ఎంఎం కీరవాణీ సోమవారం లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆస్కార్ అవార్డులను అందుకున్నారు. ప్రపంచంలోనే గొప్ప అవార్డులుగా చెప్పుకునే ఆస్కార్‌ను ఒక తెలుగు పాటకు దగ్గడంపై యావత్ తెలుగు ప్రజలతో పాటు దేశం మొత్తం సంబురాల్లో మునిగిపోయింది. ప్రధాని మోదీ నుంచి సామన్య సినీ ప్రేమికుల వరకు అంతా నాటు నాటు పాటను, ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సినిమా దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి, కథానాయకులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లను యావత్ దేశం కీర్తిస్తోంది.
ఇంతటి సంతోషంతో ఇప్పటికే దేశం మొత్తం ఇప్పటికే ఊబ్బితబ్బిబవుతున్న తరుణంలో మరో శుభవార్త అందింది. భారత క్రికెట్ జట్టు ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ వార్తతో ఇటు క్రికెట్ అభిమానులు, అటు ఆస్కార్ అవార్డుతో సినీ ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో క్రికెట్, సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఈ రెండు రంగాల్లోనూ గుడ్‌న్యూస్‌లతో దేశంలో సంతోషం వెల్లివిరుస్తోంది. భారతీయ సినిమాకు ఆస్కార్ రావడం, భారత క్రికెట్ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడంతో.. ఈ రెండు సంతోషాలను కలిపి.. రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీతో నాటునాటు పాటకు స్టెప్పులు వేస్తున్నట్లు పోస్టర్లు చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కోహ్లీ-రోహిత్ నాటు నాటు పాటకు స్టెప్పులు వేస్తున్న పోస్టర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జూన్ 7 నుంచి ఇంగ్లండ్‌లోని ఓవెల్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి.. రోహిత్-కోహ్లీ జంట కూడా రామ్‌చరణ్-ఎన్టీఆర్‌లా నాటు నాటు స్టెప్పులను అదరగొట్టాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం భారత్‌ను రెండు శుభవార్తలు సంతోషంలో ముంచెత్తుతున్నాయి. ఆస్కార్, డబ్ల్యూటీసీ ఫైనల్. ఈ రెండు కలగలిపి క్రికెట్ అభిమానులు.. కోహ్లీ-రోహిత్ పోస్టర్లను వైరల్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Back-to-back WTC finals for India 🕺 🕺 pic.twitter.com/8f7EpVUrpW
— ESPNcricinfo (@ESPNcricinfo) March 13, 2023
✅World Test Championship 2021 final
✅World Test Championship 2023 finalIndia is the only team to be featured in both WTC finals 🕺
📸: @RRRMovie pic.twitter.com/0nUYPAyDGS
— CricTracker (@Cricketracker) March 13, 2023