ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో కేరళ కుర్రాడు రోహన్ కున్నుమ్మల్ అదరగొడుతున్నాడు. దులీప్ ట్రోఫీ ప్రస్తుతం సీజన్‌లో సౌత్‌జోన్‌కు ఆడుతున్న రోహన్.. దులీప్ ట్రోఫీలో తన అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. నార్త్‌జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో రోహన్ ఈ సెంచరీ చేశాడు. కాగా.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో రోహన్‌కు ఇది నాలుగో సెంచరీ.. కేవలం ఆరు ఇన్సింగ్స్‌ల్లోనే రోహిన్ నాలుగు సెంచరీలు బాదడం విశేషం. రోహన్ చేస్తున్న ఈ బ్యాటింగ్ చూసి కేరళ క్రికెట్ నుంచి మరో సంజూ శాంసన్ టీమిండియాకు దొరికాడంటూ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. కాగా.. దులీప్ ట్రోఫీలో సెంచరీ చేసిన తొలి మలయాళీ క్రికెటర్ రోహనే.
కాగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సంచలనాలు సృష్టించిన సంజూ శాంసన్.. ఆ తర్వాత ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చి టీమిండియాకు సైతం ఆడాడు. ప్రస్తుతం సంజూ శాంసన్ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. అలాగే న్యూజిలాండ్ ఏ టీమ్‌తో మూడు వన్డేల సిరీస్ కోసం ఇండియా ఏ టీమ్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రోహన్ కున్నుమ్మల్ కూడా సంజూలానే ఐపీఎల్‌లో అదరగొట్టి, టీమిండియాకు ఎంపిక అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2023లో రోహన్‌కు మంచి డిమాండ్ ఉండటం ఖాయం. మే 10 1998లలో జన్మించిన రోహన్ ఇప్పటి వరకు 4 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 9 లిస్ట్ ఏ మ్యాచ్‌లు, 11 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
రోహన్ ఆడిన 4 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో మొత్తం ఆరు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 8, 107, 129, 106, 75, 143 పరుగులు బాదాడు. శుక్రవారం సెమీఫైనల్‌లో 143 పరుగులు చేసిన రోహన్.. నవదీప్ షైనీ బౌలింగ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ రోజు ఆటముగిసే సమయానికి సౌత్‌జోన్ రెండు వికెట్లు కోల్పోయి 324 పరుగులు చేసింది. రోహన్‌తో పాటు టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ క్రికెటర్ హనుమ విహారి సైతం సెంచరీ సాధించాడు. ప్రస్తుతం అతను 107 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. అతనితో పాటు బాబా ఇంద్రజిత్ కూడా క్రీజ్‌లో ఉన్నాడు. మరి రోహన్ బ్యాటింగ్, సంజూ శాంసన్‌తో పోలికపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఊతప్ప నిస్వార్థమే ‘రోహిత్ 264’ ఇన్నింగ్స్‌కు కారణం!
24-year-old Rohan Kunnummal in First Class cricket:
8(13)
107(97)
129(171)
106*(87)
75(110)
143(225) in Duleep Trophy— Johns. (@CricCrazyJohns) September 15, 2022
Rohan Kunnummal’s purple patch continues unabated, brings up his 100 off 172 balls.
Follow all live updates from the two semifinals here 👇https://t.co/x01VoszUqb | #DuleepTrophy pic.twitter.com/1q9r4ZHCCl
— Sportstar (@sportstarweb) September 15, 2022