టీమిండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్-2022లో భాగంగా ప్రస్తుతం రీషెడ్యూల్డ్ టెస్టు నడుస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేసిన భారత్ పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. జాస్ప్రిత్ బుమ్రా అటు బ్యాటుతోనే కాకుండా బాల్ తోనూ రాణిస్తున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో రిషభ్ పంత్(146), జడేజా(104) అద్భుత శతకాలతో ఆకట్టుకున్నారు. మ్యాచ్ తర్వాత ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్.. జడేజా ఆటను ప్రశంసించాడు. కానీ, జడేజా మాత్రం అతనికి కౌంటర్ ఇచ్చాడు. అసలు వారి మధ్య ఉన్న వైరం ఏంటో చూద్దాం.
రెండో రోజు ఆట ముగిసిన తర్వాత అండర్సన్ మాట్లాడుతూ.. “జడేజా గతంలో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. దానివల్ల టెయిలెండర్లతో సరిగ్గా ఆడలేకపోయేవాడు. కానీ, ప్రస్తుతం 7వ స్థానంలో బ్యాటింగ్ కు రావడం వల్ల అతనికి క్రీజులో కుదురుకునేందుకు అవకాశం దక్కింది. అలా శతకంతో అద్భుతంగా రాణించాడు. తద్వరా మాకు కష్టాలు తప్పలేదు” అంటూ ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ మ్యాచ్ తర్వాత జడేజా ఆటపై స్పందించాడు.
James Anderson said, “I don’t think there’s any dramatic change in Ravindra Jadeja’s batting over the years, earlier he used to come at No.8 and he didn’t use to get much time, so he had to take on his chances. Whereas now he can bat like a proper batter”.
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 3, 2022
అండర్సన్ వ్యాఖ్యలపై జడేజా కూడా స్పందించాడు.. “మనం మంచిగా బ్యాటింగ్ చేసినంతకాలం అంతా మంచి బ్యాటర్ అంటూ చెబుతుంటారు. నేను అవేమీ పట్టించుకోను. నేనెప్పుడూ క్రీజులో ఎక్కువ సమయం గడిపేందుకు నూటికి నూరు శాతం ప్రయత్నిస్తాను. నాన్ స్ట్రైకర్‌తో కలిసి సరైన భాగస్వామ్యం ఏర్పరిచేందుకే చూస్తాను. అండర్సన్ మాటలు విన్నాను.. 2014లో మా మధ్య జరిగిన ఘటన తర్వాత అతను నన్ను మంచి బ్యాటర్ అని మాట్లాడేలా జ్ఞానోదయం కలగడం బాగుంది” అంటూ జడేజా కౌంటర్ ఇచ్చాడు.
“The good thing is that James Anderson realised from 2014 onwards.” – Ravindra Jadeja (On Anderson’s comments ‘Full fledged batter)
— CricketMAN2 (@ImTanujSingh) July 3, 2022
అయితే ఇప్పుడు చాలా మంది అసలు ఆ సమయంలో వారి మధ్య ఏం జరిగింది అని వెతుకులాట మొదలు పెట్టారు. 2014లో ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టు సందర్భంగా పెవిలియన్ లో జడేజా- అండర్సన్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. కారణం లేకుండా జడేజాను అండర్సన్ పక్కకు తోశాడని ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ పై టీమిండియా.. ఐసీసీకి ఫిర్యాదు చేసింది. బీసీసీఐ ఫిర్యాదుతో అండర్సన్ పై లెవల్-3 కింద ఐసీసీ చర్యలు కూడా తీసుకుంది. ఇప్పుడు జడేజా వ్యాఖ్యలతో ఆ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. జడేజా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Jadeja Press Conference post Day 2 of England vs India 5th Test | Jadeja’s reply to Anderson
Watch extended PC on OneCricket youtube channel:https://t.co/FqMmPcR3Hv#Jadeja #RishabhPant #TeamIndia #ENGvIND pic.twitter.com/2ScbXsgiVU
— OneCricket (@OneCricketApp) July 2, 2022