బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ దుమ్మురేపుతోంది. తొలి రెండు టెస్ట్ ల్లో ఘన విజయాలు సాధించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ ల్లో సత్తా చాటిన రవీంద్ర జడేజా ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. సచిన్ కన్నా వేగంగా ఆ రికార్డు అందుకున్న భారత ప్లేయర్ గా నిలిచాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ దుమ్మురేపుతోంది. తొలి టెస్ట్ లో ఆసిస్ ను చిత్తు చేసిన టీమిండియా అదే జోరును రెండో టెస్ట్ లోనూ చూపించింది. దాంతో నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 2-0తో ముందంజలో ఉంది. అయితే ఈ రెండు మ్యాచ్ ల్లో ఆసిస్ ను బెంబేలెత్తించాడు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. రెండు మ్యాచ్ ల్లో కలిపి 17 వికెట్లను నేల కూల్చడే కాకుండా బ్యాటింగ్ లోనూ కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డును సైతం నెలకొల్పాడు. ఏకంగా క్రికెట్ గాడ్ సచిన్ రికార్డునే సమం చేశాడు.
రవీంద్ర జడేజా.. గత కొన్ని నెలలుగా గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసిస్ తో మ్యాచ్ తో క్రికెట్ కు రీ ఎంట్రీ ఇచ్చాడు. మోకాలికి శస్త్ర చికిత్స జరిగిన తర్వాత తన సత్తా తగ్గుతుందని చాలా మంది విమర్శలు చేశారు. ఆ విమర్శలన్నింటికి తన బాల్ తోనే సమాధానం ఇచ్చాడు జడ్డూ భాయ్. ఆస్ట్రేలియాపై గెలిచిన రెండు మ్యాచ్ ల్లో సత్తా చాటాడు జడేజా. ఈ మ్యాచ్ ల్లో 17 వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక రెండో మ్యాచ్ లో పది వికెట్లతో సత్తా చాటిన జడ్డూ భాయ్.. మరోసారి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. దాంతో ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు జడేజా. క్రికెట్ గాడ్ సచిన్ రికార్డును సమం చేశాడు. ఓ రకంగా సచిన్ రికార్డు బ్రేక్ చేశాడనే చెప్పాలి. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే.
భారతదేశంలో ఆడిన టెస్ట్ మ్యాచ్ లల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లు గెలిచిన భారత ఆటగాళ్ల జాబితాలో సచిన్ సరసన చేరాడు. ఈ క్రమంలోనే ఇండియాలో 94 టెస్టులు ఆడిన సచిన్ 8 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లు గెలుచుకోగా.. జడేజా కేవలం 38 మ్యాచ్ ల్లోనే 8 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లు కైవసం చేసుకున్నాడు. దాంతో తక్కువ మ్యాచ్ ల్లో ఎక్కువ అవార్డులు గెలుచుకుని సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు జడేజా. ఇక జాబితాలో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే. 63 టెస్ట్ మ్యాచ్ ల్లో 9 సార్లు ఈ అవార్డులను గెలుచుకున్నాడు కుంబ్లే. మరి రీ ఎంట్రీ తర్వాత అద్భుతంగా రాణిస్తున్న జడేజాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ravindra Jadeja, India’s all-round ace ⭐https://t.co/PaMrwfQvfF #INDvAUS pic.twitter.com/u8lZET30pX
— ESPNcricinfo (@ESPNcricinfo) February 20, 2023