భారత్-వెస్టిండీస్ మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం రాత్రి కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత ఫీల్డిండ్ ఎంచుకున్న టీమిండియా విండీస్‌ను ఒక మోస్తారు స్కోర్‌కే కట్టడి చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విండీస్ 157 పరుగులు చేసింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ నికోలస్ పూరన్ 43 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 61 పరుగులతో అదరగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ రోహిత్ 40 పరుగులతో రాణించాడు.
కాగా ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టీ20 క్రికెట్లోకి అరంగేట్రం చేసిన రవి బిష్ణోయ్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లోకి అరంగేంట్రం చేసిన ఆరో పిన్న వయస్కుడిగా రవి బిష్ణోయ్ నిలిచాడు. రవి బిష్ణోయ్ వయసు 21 సంవత్సరాల 164 రోజులుగా ఉంది. టీ20 క్రికెట్లో అరంగేంట్ర మ్యాచ్‌లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న తొమ్మిదో భారత ఆటగాడిగా కూడా బిష్ణోయ్ రికార్డు సృష్టించాడు. అలాగే అరంగేంట్రంలోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన ఐదో భారత బౌలర్‌గా నిలిచాడు. ఇక భారత్‌లో అరంగేట్రం చేసి అత్యుత్తమ గణాంకాలు నమెదు చేసిన రెండో భారత బౌలర్‌గా బిష్ణోయ్ నిలిచాడు. మరి రవి బిష్ణోయ్‌ను పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. మరి బిష్ణోయ్ సాధించిన రికార్డులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Winning Man of the Match on debut is dream come true for leg-spinner #RaviBishnoi
Read: https://t.co/yuCtTqH57l pic.twitter.com/1tLhWqsFqv
— Cricket Fanatic (@CricketFanatik) February 17, 2022