వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో సంజు శాంసన్ కి చోటు దక్కని సంగతి తెలిసిందే. అయితే గిల్ ఔటైన తర్వాత బ్యాటింగ్ కి దిగి అందరికీ షాక్ ఇచ్చాడు.
టాలెంట్ ఉన్న టీమిండియాలో ఇప్పటికీ ఛాన్స్ దక్కించుకోలేకపోతున్నాడు సంజు శాంసన్. అడపదడపా అవకాశాలు అంతలోనే గాయాలు. దీంతో జట్టులో రెగ్యులర్ ప్లేయర్ గా మారేందుకు సంజు ఇప్పటికీ ఎదురు చూడాల్సిన పరిస్థితి. తాజాగా వెస్టిండీస్ జరిగిన తొలి వన్డేలో కూడా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కి తుది జట్టులో స్థానం దక్కలేదు. శాంసన్ ప్లేస్ లో వికెట్ కీపర్ బ్యాటర్ గా ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్ కి అవకాశం దక్కింది. అంతేకాదు ఈ మ్యాచులో ఓపెనింగ్ ప్రమోషన్ కూడా లభించింది. అయితే అందరికీ షాక్ ఇస్తూ శాంసన్ విండీస్ తో జరిగిన తొలి మ్యాచులో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. అదేంటి తుది జట్టులో స్థానం దక్కని శాంసన్ ఎలా బ్యాటింగ్ చేసాడనుకుంటున్నారా? అయితే ఈ పూర్తి స్టోరీ చదివేయాల్సిందే.
ఊహించినట్లుగానే మరోసారి సంజు శాంసన్ కి నిరాశ తప్పలేదు. రోహిత్ ప్లేయింగ్ 11 ప్రకటించగానే అందులో సంజు శాంసన్ పేరు లేకపోవడంతో బీసీసీఐపై సంజు ఫ్యాన్స్ విమర్శలు గుప్పించారు. అయితే దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ వివరణ ఇచ్చాడు. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసమే తుది జట్టులోకి శాంసన్ ప్లేస్ లో కిషన్ వచ్చాడని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా ఈ మ్యాచులో ఓపెనర్ గిల్ సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ కి వచ్చాడు. అయితే సూర్య వేసుకున్న జెర్సీ సంజు శాంసన్ ది కావడంతో అభిమానులు కాస్త గందరగోళానికి గురయ్యారు. ఇక అసలు విష్యం తెలుసుకున్న ఫ్యాన్స్ సంజు జట్టులో లేకపోయినా గ్రౌండ్ లో ఉన్నాడని అభిమానులు ఫీలయ్యారు. అయితే సూర్య ఈ జెర్సీ ఎందుకు వేసుకున్నాడో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సంజు శాంసన్ ఫ్యాన్స్ సూర్య కుమార్ యాదవ్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా స్పిన్నర్లు చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు 23 ఓవర్లలో కేవలం 114 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ షై హోప్ 43 పరుగులు చేసి పర్వాలేదనిపించగా మిగిలిన వారందరూ విఫలమయ్యారు. కుల్దీప్ యాదవ్ 4, జడేజా 3 వికెట్లు తీసుకున్నారు. పేసర్లు ముఖేష్ కుమార్, శార్దుల్ ఠాకూర్, హార్దిక్ పాండ్యకి తలో ఒక వికెట్ దక్కింది. ఇక స్వల్ప లక్ష్యా ఛేదనలో టీమిండియా 5 వికెట్లు కోల్పోయి ఈ టార్గెట్ ని ఛేజ్ చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (52) ఒక్కడే హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా మిగిలిన వారు విఫలమయ్యారు. మరి సూర్య కుమార్ యాదవ్ సంజు శాంసన్ జెర్సీ ధరించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.