పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ఆరంభం నుంచి ఉన్నా.. ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. చాలా సార్లు గెలుపు అంచుల వరకూ వచ్చి బోల్తా కొట్టేది. తాజా ఈ సీజన్‌లో శుక్రవారం కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా గెలుపు ముంగిట్లోకి వచ్చి ఓడింది. చివరి ఓవర్‌లో 19 పరుగులను డిఫెండ్ చేసుకోలే.. ఐపీఎల్ 2022లో రెండో ఓటమి చవిచూసింది. ఇక పంజాబ్‌ను ఈ మ్యాచ్‌లో చావు దెబ్బకొట్టిన రాహుల్ తెవాటియా పంజాబ్ కింగ్స్‌కు నిద్రలేని రాత్రిని ఇచ్చాడు. చివరి రెండు బంతుల్లో రెండు సిక్సులు కొట్టి గుజరాత్ టైటాన్స్‌కు నమ్మశక్యంకాని గెలుపును అందించాడు.
గతంలో ఇదే పంజాబ్‌పై టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కూడా చివరి రెండు బంతుల్లో 12 పరుగుల అవసరమైన సమయంలో రెండు భారీ సిక్సులు బాదీ.. రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌కు విజయం అందించాడు. ఇప్పుడు తెవాటియా కూడా అచ్చం ధోనిలానే రెండు బంతుల్లో రెండు సిక్సులు బాది సూపర్ విక్టరీని అందించాడు. ఈ రెండు థ్రిల్లింగ్ విక్టరీల్లో బలైంది పంజాబ్ కావడం విశేషం. ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా కేకేఆర్‌పై చివరి రెండు బంతుల్లో రెండు సిక్సులు బాది సీఎస్‌కేను గెలిపించాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఐపీఎల్‌లో ఒకే ఒక్కడు! తొలి ఇండియన్ క్రికెటర్‌గా ధావన్ రికార్డు
MS Dhoni and Rahul Tewatia are the only players to win the game from 12 from 2 balls in IPL history.
— Johns. (@CricCrazyJohns) April 8, 2022
Rahul Tewatia has joined Elite club with MS Dhoni#IPL2022 #PBKSvGT pic.twitter.com/BolyVeUOaK
— RVCJ Media (@RVCJ_FB) April 8, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.