టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సహజంగా తన హావాభావాలను బయటపెట్టడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా చాలా కూల్‌గా ఉంటాడు. మైదానంలో కూడా ఎలాంటి భావోద్వేగాలకు గురికాడు. అలాంటి వ్యక్తి భారత్-శ్రీలంక మధ్య గురువారం జరిగిన మ్యాచ్‌లో ఇచ్చిన ఫన్నీ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక సంఘటనకు ద్రవిడ్ నుంచి ఇలాంటి రియాక్షన్‌ను క్రికెట్ అభిమానులు ఇంతవరకు చూసిఉండరు. అందుకే ఇది చూసి ద్రవిడ్ ఫ్యాన్స్, క్రికెట్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
మరి ద్రవిడ్ అంతలా అదిరిపోయే రియాక్షన్ ఎందుకు ఇచ్చాడంటే… శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ అసలంక వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. చాహల్ విసిరిన బంతిని స్వీప్ ఆడబోయాడు.. కానీ బంతి ప్యాడ్లకు తాకింది. దీంతో చాహల్ అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. టీమిండియా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. కానీ అసలంక డీఆర్ఎస్ రివ్యూ కోరాడు. అది కచ్చితంగా అవుట్ అని టీమిండియా ప్లేయర్లతో పాటు, కోచ్ ద్రవిడ్ కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు.
కానీ రీప్లేలో బంతి బ్యాట్‌కు తగులుతున్నట్లు కనిపించింది. స్వల్ప ఎడ్జ్ తీసుకుని ప్యాడ్లకు తగిలినట్లు నిర్ధారించిన థర్డ్ అంపైర్ దాన్ని నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇలా అయింది ఏందబ్బా అన్నట్లు నవ్వగా.. డగౌట్లో కూర్చున్న ద్రవిడ్ మరింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తల పట్టుకున్నాడు. ఎప్పుడూ కామ్ అండ్ కూల్‌గా ఉండే ద్రవిడ్ ఇలా ఫన్నీ రియాక్షన్ ఇవ్వడంతో హైలెట్ అయింది. ప్రస్తుతం ద్రవిడ్ రియాక్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ద్రవిడ్ రియాక్షన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
We need more candids from Rahul Dravid pic.twitter.com/4Rja144Nas
— Benaam Baadshah (@BenaamBaadshah4) February 25, 2022