రాహుల్ ద్రవిడ్ పై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పక్కనే ఉంటూ కోహ్లీకి వెన్నుపోటు పొడుస్తున్నాడని ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే?
ఈ జనరేషన్ లో క్రికెట్ అనగానే ముందుగా గుర్తుకి వచ్చే పేరు విరాట్ కోహ్లీ. సచిన్, గంగూలీ, ద్రవిడ్ తరువాత అంతటి క్రేజ్ దక్కించుకున్న ఏకైక క్రికెటర్ కోహ్లీనే. ఇక విరాట్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే.. ఇప్పుడు వారంతా టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ ని టార్గెట్ చేశారు. కోహ్లీకి ద్రవిడ్ వెన్నుపోటు పొడుస్తున్నాడని, సీనియర్ అని గౌరవించుకున్నందుకు నమ్మక ద్రోహం చేస్తున్నాడంటూ కాస్త పెద్ద కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సచిన్ పై ద్రవిడ్ కు ఉన్న ప్రేమ కారణమని కొత్త లాజిక్ చెప్తున్నారు. మరి.. లెజెండరీ క్రికెటరైన ద్రవిడ్ పై కోహ్లీ ఫ్యాన్స్ కోపానికి కారణం ఏమిటి? మధ్యలో సచిన్ ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు? ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది. ఇప్పటికే టెస్ట్, వన్డే సిరీస్ లు గెలిచిన భారత్ జోరుపై ఉండగా.. కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం ఆవేశంతో ఊగిపోతున్నారు. దీనికి కారణం చివరి రెండు వన్డేలలో కింగ్ కోహ్లీ టీమ్ లో ఉండకపోవడమే. కోహ్లీ లాంటి ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్ ని మ్యాచ్ లో ఆడించకుండా, రెస్ట్ ఇవ్వడం ఏమిటి అన్నది ఫ్యాన్స్ ప్రశ్న. ఒకవేళ జూనియర్స్ కు అవకాశం ఇవ్వాలని ద్రవిడ్ భావిస్తే.. కోహ్లీని ఈ సిరీస్ కు ఎంపిక చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ అలా రెస్ట్ ఇచ్చి ఉంటే వరల్డ్ కప్ ముందు కాస్త రీ ఫ్రెష్ అయ్యే ఛాన్స్ దక్కేది కదా అన్నది వారి భావన! అలా రెస్ట్ ఇవ్వకుండా, మ్యాచ్ లోనూ ఆడించకుండా ద్రవిడ్ ఏమి సాధించినట్టు అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇంకొంత మంది ఫ్యాన్స్ మాత్రం కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు. అన్నీ వన్డే మ్యాచ్ ల్లో కోహ్లీని ఆడిస్తే.. ఎక్కడ సచిన్ సెంచరీలను దాటేస్తాడో అనే భయంతోనే ద్రవిడ్.. ఇలా కోహ్లీకి రెస్ట్ ఇస్తున్నాడని ఆరోపిస్తున్నారు.
ఇక సచిన్ పేరిట మొత్తం 100 సెంచరీలు ఉన్నాయి. వీటిలో 49 వన్డే సెంచరీలు కాగా.., 51 టెస్ట్ సెంచరీలు. ఇక కోహ్లీ పేరిట మొత్తం 76 సెంచరీలు ఉన్నాయి. వీటిలో 46 వన్డే సెంచరీలు కాగా, 29 టెస్ట్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ ఎలాగో సచిన్ వన్డే సెంచరీల రికార్డు అధిగమించేస్తాడు. కానీ.., ఓవరాల్ గా 100 సెంచరీల మార్క్ అందుకోవాలంటే మాత్రం ఇంకాస్త లాంగ్ కెరీర్ అవసరం. పైగా.. వీలైనన్ని
ఎక్కువ మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. ఇప్పుడు ద్రవిడ్.. రెస్ట్ పేరిట ఆ అవకాశం లేకుండా చేస్తుండటంతో కోహ్లీ ఫ్యాన్స్ మిస్టర్ వాల్ పై విరుచుకుపడుతున్నారు. అయితే.. కుర్రాళ్లను పరీక్షించే క్రమంలో సీనియర్స్ కు ఇలాంటి త్యాగాలు తప్పవు అన్నది ద్రవిడ్ వాదన. మరి.. ఈ విషయంలో ఎవరు కరెక్ట్? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.