భారత్-వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ నేడు(శుక్రవారం) పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగే తొలి వన్డేతో ప్రారంభం కానుంది. ఈ మూడు వన్డేల తర్వాత ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ కూడా జరగనుంది. ఈ రెండు సిరీస్‌ల నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. గత కొంత కాలం ఫామ్‌లో లేని కోహ్లీపై విశ్రాంతి నెపంతో వేటు వేశారనే వాదన కూడా వినిపిస్తుంది.
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ గురించి వెస్టిండీస్ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి. టీమిండియాలో విరాట్ కోహ్లీ లేకపోవడం తనకు బాధ కలిగిస్తోందని సిమన్స్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లీ ఎంత గొప్ప ఆటగాడో అతని రికార్డులు చూస్తే అర్థం అవుతుంది. అలాంటి అత్యుత్తమ ఆటగాళ్లతో ఆడాలని అందరూ కోరకుంటారు.
ప్రస్తుతం వెస్టిండీస్ టూర్‌కు వచ్చిన భారత జట్టులో విరాట్ కోహ్లీ లేకపోవడం నాకు నిరాశ కలిగించింది. మా ఆటగాళ్లు కూడా గట్టిపోటీ ఇచ్చే ప్రత్యర్థితో ఆడేందుకు ఇష్టపడతారు’ అని సిమన్స్ పేర్కొన్నారు. అలాగే విరాట్ కోహ్లీ బ్యాడ్‌ఫామ్ గురించి స్పందిస్తూ.. ‘ఆటగాళ్లపై విమర్శలు రావడం సహజం. గొప్ప ఆటగాళ్లు ప్రతి సారి గొప్పగా ఆడాలని అందరూ కోరకుంటారు. కానీ ప్రతిసారి మంచి ప్రదర్శన చేయడం ఎవరికీ సాధ్యం కాదు’ అని అన్నారు.
అలాగే విరాట్ కోహ్లీని జట్టులో కొనసాగించాలని, నేను భారత కోచ్ లేదా కెప్టెన్‌గా ఉంటే అదే చేసేవాడినని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలకు సిమన్స్ కౌంటరిచ్చారు. టీమిండియా కోచ్‌గా ద్రవిడ్ ఉన్నారు.. ఆ జట్టు విషయంలో ఏం చేయాలో ఆయనకు తెలుసు అని పాంటింగ్‌కు సిమన్స్ చురకలు అంటించారు.
అయితే సిమన్స్ చెప్పినట్లు టీమిండియాలో కోహ్లీ లేకపోవడం లోటే అయినా.. ప్రస్తుతం ఉన్న యంగ్ టీమిండియాతో తలపడటం వెస్టిండీస్ జట్టుకు అంత సులభమైన పని కాదు. యువ భారత జట్టులో కూడా మ్యాచ్ విన్నర్లకు కోదవ లేదు. పైగా ఇంగ్లండ్ టూర్‌లో విరాట్ కోహ్లీ విఫలం అయినా కూడా కుర్రాళ్లు టీ20, వన్డే సిరీస్‌లు గెలిచిన విషయం మర్చిపోవద్దు. మరి విరాట్ కోహ్లీ గురించి సిమన్స్ స్పందనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Phil Simmons is unhappy with Virat Kohli skipping the Windies tour.#Windies #Westindies #ViratKohli #India #WIvsIND https://t.co/QMMtM17hQO
— Sky11 (@sky11official) July 22, 2022
‘The guys would have loved the competition’: #Windies coach #PhilSimmons on #ViratKohli‘s absence from serieshttps://t.co/rrIoKmf33R
— DNA (@dna) July 22, 2022