ఆస్ట్రేలియా హెడ్ కోచ్ పదవికి జస్టిన్ లంగర్ రాజీనామా చేయడంతో ఆసీస్ క్రికెట్‌లో తీవ్ర దుమారం రేగుతోంది. తన పదవి కాలం గడువు ఉన్నా.. అంతకంటే ముందే కోచ్‌గా లంగర్ తప్పుకోవడం చర్చనీయాంశమైంది. లంగర్ రాజీనామాతో ఆసీస్ మాజీ ఆటగాళ్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా జట్టులోని కొంతమంది ఆటగాళ్లు, కోచ్ లంగర్‌కు మధ్య విభేదాల కారణంగానే బోర్డు లంగర్ చేత రాజీనామా చేయించిందనే ఆరోపణలు వెలుగుచూశాయి. దీంతో ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్‌తో పాటు మరికొంత మంది మాజీలు బోర్డుపై మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లపై కూడా విమర్శలు వచ్చాయి. దీంతో ఆసీస్ టెస్ట్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. ఈ విషయంలో మాజీ క్రికెటర్లు స్పందనపై గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. వారి తోటి ఆటగాడికి మాజీలు బాగానే మద్దతు తెలుపుతున్నారని.. మరీ నేను కూడా నా సహా క్రికెటర్లకు మద్దతుగా ఉంటానని.. ఇదే విషయమై ప్రెస్ మీట్‌లో మాట్లాడాతని కమిన్స్ ప్రకటించాడు. దీంతో ఆసీస్ క్రికెట్లో వివాదం ముదిరింది. ఆటగాళ్లు, కోచ్ మధ్య విభేదాలు ఇప్పడు మాజీ క్రికెటర్లు వర్సెస్ తాజా క్రికెటర్లుగా మారింది. మరి ఈ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Absolutely loved the last part of #PatCummins statement ! Though I don’t feel Langer should go but still this communication is solid . pic.twitter.com/pjapAwgORP
— Vikram Sathaye (@vikramsathaye) February 9, 2022