క్రికెట్ బీభత్సంగా వినోదం పంచే ఆట. అద్భుతమైన ఆటతో పాటు అప్పుడప్పుడు చెత్త ఆటతీరుతో కూడా క్రికెటర్లు వినోదం పంచుతుంటారు. శుక్రవారం పాకిస్తాన్– వెస్టిండీస్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో కూడా ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి చోటుచేసుకుంది. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ షమర్ బ్రూక్స్ కొట్టిన భారీ షాట్ గాల్లోకి లేచింది. దీంతో బౌండరి లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న పాక్ ఆటగాడు హసైన్ క్యాచ్ అందుకునే వచ్చాడు. అదే సమయంలో మరో ఆటగాడు ఇఫ్తికర్ అహ్మెద్ కూడా క్యాచ్ కోసం వచ్చాడు.
ఒక్కరు పడ్తారని ఇంకొకరు అనుకోవడంతో ఇద్దరి మధ్య బాల్ పడింది. దీంతో ఇద్దరూ చూస్తూ ఉండిపోయారు. సునాయసమైన క్యాచ్‌ను సమన్వయ లోపంతో నేలపాలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుంది. క్రికెట్ ఫ్యాన్స్ పాక్ ఫీల్డింగ్‌పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా ఉతప్ప ఇచ్చిన క్యాచ్‌ను కూడా ఇదే విధంగా పాక్ ఆటగాళ్లు వదిలేశారు. మీకు ఇది అలావాటే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. మరి పాక్ ఫీల్డింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ గురించి మీకు తెలియని విషయాలు!
We have seen this before?🤔pic.twitter.com/aeJOcefmjG
— CricTracker (@Cricketracker) December 16, 2021
Amit Mishra came pretty close to Saeed Ajmal with that drop catch of Uthappa #IPL pic.twitter.com/x6GjvkDuW1
— Shubh Aggarwal (@shubh_chintak) April 28, 2017
hahaha… super fielding bro….😀😀😀 https://t.co/tRmcdJA20p
— Sayyad Nag Pasha (@PashaNag) December 17, 2021
Hasnain Paying a Tribute to Ajmal’s Famous Catch 😂😂😂🤣🤣🤣 pic.twitter.com/aJHFolGjDm
— Taimoor Zaman (@taimoorze) December 16, 2021