ఏ ఆటగాడైనా అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తే అతడిని జట్టులోని మిగతా ఆటగాళ్లందరు ప్రశంసించడం సహజమే. కానీ తాజాగా భారత బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించడంతో పాక్ క్రికెటర్స్ అతడిపై ట్వీటర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక క్రికెట్ లో భారత్ – పాక్ లకు ప్రత్యేక స్థానం ఉంది. క్రికెట్ లో దాయాది దేశాలు తలపడుతున్నాయి అంటే చాలు.. ప్రపంచం మెుత్తం మన వైపే చూస్తుంది. ఇలాంటి సమయంలో విరాట్ కోహ్లీ ఆఫ్గానిస్తాన్ పై సెంచరీ సాధించాడు. దాంతో కింగ్ విరాట్ పై సర్వత్రా అభినందనల వర్షం కురుస్తోంది. మూడు సంవత్సరాల తర్వాత విరాట్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే అతడిపై భారత ఆటగాళ్లతో పాటు ప్రపంచ క్రీడా దిగ్గజాలు కూడా అతడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
విరాట్ కోహ్లీ.. గత మూడు సంత్సరాలుగా ఆకలి గొన్న పులిలా సెంచరీ కోసం తహతహలాడుతున్నాడు. దాంతో తన వేట ఎప్పుడెప్పుడు మెుదలు పెడదామా అని చూస్తున్నాడు. ఇక ఆసియా కప్ 2022లో తన వేటను మెుదలు పెట్టాడు కింగ్ కోహ్లీ. వరుసగా పాక్, హాంకాంగ్ లపై అర్దశతకాలతో జోరుమీదున్న విరాట్.. తన శతక వేటను మాత్రం ఆఫ్గానిస్తాన్ పై తీర్చుకున్నాడు. కేవలం 61 బంతుల్లోనే 12 ఫోర్లు, 6 సిక్స్ లతో ప్రత్యర్థిపై విరుచుకుపడి 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ 101 రన్స్ తో విజయం సాధించింది. దీంతో 71 శతకాలు బాదిన కింగ్ విరాట్ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తోన్నాయి.
అయితే అన్ని ప్రశంసలు ఒకెత్తు అయితే పాకిస్థాన్ కు చెందిన క్రికెటర్ల చేసిన ప్రశంసలు మరో ఎత్తు. ప్రస్తుతం ఆదేశ ఆటగాళ్లు చేసిన ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.. విరాట్ శతకం పై పాక్ క్రికెటర్లు ఈ విధంగా స్పందించారు.” పాక్ స్పీడ్ స్టర్ మహ్మద్ అమీర్ స్పందిస్తూ.. మెుత్తానికి మా నిరీక్షణ ఫలించింది. గ్రేట్ సెంచరీ కింగ్ కోహ్లీ” అని రాసుకొచ్చాడు. ఇక మరో ఆటగాడు అయిన హసన్ అలీ గొప్ప ప్లేయర్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు” అని వర్ణించాడు. “ఇది కదా ఆటంటే.. ఇది కదా వేటంటే.. వాట్ ఏ క్లాస్ బ్యాటింగ్.. ఇది అద్భుతమైన ఇన్నింగ్స్. మీరు కుర్రాళ్లకు ఆదర్శం విరాట్..” అంటూ పాక్ మాజీ క్రికెటర్ అజార్ మహ్మద్ ప్రశంసించాడు.
పాక్ మాజీ వికెట్ కీపర్ కామ్రాన్ అక్మల్ సైతం విరాట్ సెంచరీ పై స్పందించాడు. ” ఫామ్ కేవలం తాత్కాళికమే.. కానీ క్లాస్ ఆట మాత్రం పర్మినెంట్” అని కొనియాడాడు. మరి కొంత మంది భారత, ఇతర దేశాల ఆటగళ్లు కోహ్లీ శతకంపై స్పందించారు. వారిలో హర్భజన్ సింగ్, యూసఫ్ పఠాన్, కైఫ్, బద్రినాథ్, AB డివిల్లీయర్స్, కెవిన్ పీటర్సన్, అంజెలో మాథ్యుస్ లు, ఇంకా చాలా మంది ఉన్నారు. మరి ఓ టీమిండియా బ్యాట్స్ మెన్ పై పాక్ క్రికెటర్స్ ప్రశంసల వర్షం కురిపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Form is temporary…Class is permanent. Always love watching @imVkohli playing..what a brilliant 💯 you are a real king 👍
— Kamran Akmal (@KamiAkmal23) September 8, 2022
so finally wait is over great 💯 by king kohli
— Mohammad Amir (@iamamirofficial) September 8, 2022
The great is back @imVkohli
— Hassan Ali 🇵🇰 (@RealHa55an) September 8, 2022