ఆహా వేదికగా ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ 2 కంటెస్ట్ంట్ పై ప్రశంసలు కురిపించారు తెలంగాణ మంత్రి హరీష్ రావు.
న్యూజిలాండ్ తో మంగళవారం ఇండోర్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో పరుగుల వరద పారించింది టీమిండియా. ఓపెనర్లు శుభ్ మన్ గిల్, సారథి రోహిత్ శర్మ లు సెంచరీలతో చెలరేగడంతో 385 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ లక్ష్యతో బరిలోకి దిగిన కివీస్ 295 పరుగులకు కుప్పకూలింది. జట్టులో డెవాన్ కాన్వే 100 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్స్ లతో 138 పరుగులతో చెలరేగినప్పటికీ న్యూజిలాండ్ ను గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్ గెలుపుతో […]
టీమిండియా ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉంది. వరుస విజయాలు సాధిస్తూ.. సిరీస్ లు కైవసం చేసుకుంటోంది. మెున్న శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్ లను గెలుచుకున్న భారత్.. తాజాగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను కూడా మరో మ్యాచ్ మిగిలుండగానే చేజిక్కించుకుంది. ఇక భారత జట్టు అన్ని రంగాల్లో పటిష్టంగా ఉందనే చెప్పాలి. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా […]
న్యూజిలాండ్ తో హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో డబుల్ సెంచరీ సాధించాడు శుభ్ మన్ గిల్. దాంతో అత్యంత పిన్న వయసులో డబుల్ సెంచరీ సాధించిన బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. అయితే ఓపెనర్ గా బరిలోకి దిగి చివరి వరకు ఉన్నాడు గిల్. గిల్ ఇన్నింగ్స్ చూసిన మాజీలు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి ఆటగాడే వరల్డ్ క్రికెట్ కు అవసరం అని గిల్ పై పొగడ్తలు కురిపించాడు పాక్ మాజీ కెప్టెన్ […]
ప్రస్తుతం టీమిండియా.. మంచి జోష్ లో ఉంది. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ ను 2-1తో చేజిక్కించుకుంది భారత్. ఇక మంగళవారం నుంచి ప్రారంభం అయ్యే వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకోవాలని ఊవ్విళ్లూరుతోంది. జట్టులో ఉన్న యువ ఆటగాళ్లు అందరు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. పైగా వన్డే సిరీస్ కు విరాట్, రోహిత్, రాహుల్ లాంటి సీనియర్లు కూడా యాడ్ అయ్యారు. దీంతో టీమిండియా ఇంకా పటిష్టంగా మారింది. ఈ క్రమంలోనే టీమిండియా […]
శ్రీలంకతో రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. దాంతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను 2-1తో భారత్ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన చివరి మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు లంక బౌలర్లకు చుక్కలు చూపించారు. సిక్స్ లు, ఫోర్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డారు. మరీ ముఖ్యంగా సూర్య కుమార్ ఆట గురించి ఇక్కడ చెప్పుకోవాలి. సునామీ ఇన్నింగ్స్ ఆడిన సూర్య కేవలం 45 బంతుల్లోనే శతకంతో […]
పూణే వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో ఓటమి చెందిన విషయం మనందరికి తెలిసిందే. దాంతో తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శల వర్షం కురిపించారు మాజీలు, సగటు క్రికెట్ అభిమానులు. తొలి మ్యాచ్ లోనే చివరి ఓవర్ అక్షర్ ఇచ్చి తప్పు చేశాడని పాండ్యాని విమర్శించారు.. ఇక ఈ మ్యాచ్ లో పాండ్యా అద్బుతంగా బౌలింగ్ చేసినప్పటికీ తన కోటా పూర్తి ఓవర్లు బౌలింగ్ చేయలేదు. పైగా బౌలర్లను […]
గత కొంతకాలంగా టీమిండియాలో మారుమ్రోగుతున్న పేరు సంజూ శాంసన్. అద్భుతమైన ఆట, నైపుణ్యం ఉన్నప్పటికీ.. జట్టులో తగినంతగా అవకాశాలు రావడంలేదు. దాంతో అతడి అభిమానులు సైతం శాంసన్ కోసం ఆందోళనలు చేపట్టారు. దాంతో కంటితుడుపుగా అడపాదడపా అవకాశాలు అయితే వచ్చాయి. కానీ శాంసన్ తన ఆటను నిరూపించుకునేన్ని అవకాశాలు మాత్రం రాలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే సంజూ శాంసన్ పై ప్రశంల వర్షం కురిపించాడు శ్రీలంక దిగ్గజ బ్యాటర్, మాజీ ఆటగాడు కుమార సంగక్కర. అతడు ఏ […]
సాధారణంగా క్రికెట్ లో ఇతర ఆటగాళ్ల ఆటతీరుపై విదేశీ ప్లేయర్స్ కామెంట్స్ చేయడం మనం వింటూనే ఉంటాం. కొంత మంది విమర్శలు చేస్తే.. మరికొంతమంది ప్రశంసలు కురిపిస్తారు. గత కొంత కాలంగా టీమిండియా ప్లేయర్స్ పై విదేశీ దిగ్గజ, ప్రస్తుత క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా దక్షణాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడితో కలిసి పనిచేయాలని ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇక వరల్డ్ […]
టీమిండియాపై గత కొన్ని రోజులుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. దానికి కారణం ఇటీవలి కాలంలో వరుస టోర్నీల్లో విఫలం అవుతూ వస్తోంది భారత జట్టు. దాంతో జట్టు కూర్పుపై ఇండియా మాజీ ప్లేయర్స్ సైతం తమ నోటికి పనిచెప్పుతున్నారు. ఈ నేపథ్యంలోనే బంగ్లాతో వన్డే సిరీస్ ను కోల్పోయిన భారత్ టెస్ట్ సిరీస్ కు సన్నద్ధం అయ్యింది. ఇక రెండు టెస్టు మ్యాచ్ ల్లో భాగంగా తొలి మ్యాచ్ చట్ గావ్ వేదికగా బుధవారం(డిసెంబర్ 14) ప్రారంభం […]