టీమిండియా ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉంది. వరుస విజయాలు సాధిస్తూ.. సిరీస్ లు కైవసం చేసుకుంటోంది. మెున్న శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్ లను గెలుచుకున్న భారత్.. తాజాగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను కూడా మరో మ్యాచ్ మిగిలుండగానే చేజిక్కించుకుంది. ఇక భారత జట్టు అన్ని రంగాల్లో పటిష్టంగా ఉందనే చెప్పాలి. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ బౌలర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు భారత బౌలర్ మహ్మద్ షమీ. ఈ టీమిండియా బౌలర్ లైన్ అండ్ లెంగ్త్ పై పట్టు సాధిస్తే.. ప్రపంచాన్ని ఏలగలడు అంటూ కితాబిచ్చాడు.
గత కొంతకాలంగా టీమిండియాలో బౌలింగ్ దళంలో మారుమ్రోగుతున్న పేరు ఉమ్రాన్ మాలిక్. కశ్మిర్ ఎక్స్ ప్రెస్ గా టీమిండియా క్రికెట్ లోకి అడుగుపెట్టిన ఉమ్రాన్.. కొద్ది కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బౌలింగ్ లో గొప్ప వేగం ఉన్న పేసర్ గా ప్రపంచ వ్యాప్తంగా పేరొందాడు ఉమ్రాన్ మాలిక్. దాంతో త్వరలోనే పాక్ దిగ్గజం షోయబ్ అక్తర్ ఫాస్టెస్ట్ బాల్ రికార్డును ఉమ్రాన్ బద్దలు కొడతాడని మాజీలందరు కితాబిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ పై ప్రశంసలు కురిపించాడు టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ. తాజాగా ఉమ్రాన్ ని షమీ ఇంటర్వ్యూ చేసిన వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. ఈ సందర్భంగా షమీ మాట్లాడుతూ..” ఉమ్రాన్ నీ పేస్ ను ఎదుర్కొవడం అంత సులభం కాదు. అయితే నీకు ఒక్కటే సలహా ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు నీ స్పీడ్ ను కొనసాగిస్తూనే.. లైన్ అండ్ లెంగ్త్ పై పట్టు సాధిస్తే నీకు తిరుగుండదు. ఈ రెండింటిపై నువ్వు పట్టు సాధిస్తే.. ఈ క్రికెట్ ప్రపంచాన్నే ఏలగలవు” అంటూ ఉమ్రాన్ ను ఆకాశానికి ఎత్తేశాడు షమీ.
అయితే ప్రతి మ్యాచ్ లో ప్రశాంతంగా, ఎంజాయ్ గా ఉంటావ్ ఇదెలా సాధ్యం అని షమీ ప్రశ్నించగా..”ఒత్తిడికి గురైతే మనపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దాంతో బౌలింగ్ లయ దెబ్బతింటుంది. పైగా దేశానికి ఆడుతున్నప్పుడు ఒత్తిడి తీసుకోకూడదు అని ఉమ్రాన్ చెప్పుకొచ్చాడు. పరిస్థితులకు తగ్గట్లుగా మైదానంలో ఉన్నప్పుడే, మనలోని నైపుణ్యం సరిగ్గా ఉపయోగపడుతుంది అని ఈ సందర్భంగా ఉమ్రాన్ చెప్పుకొచ్చాడు. మరి ఉమ్రాన్ బౌలింగ్ ప్రపంచాన్ని ఏలుతాడు అన్న వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
From bowling pace & staying calm to sharing an invaluable advice 👌 👌
Raipur Special: @umran_malik_01 interviews his ‘favourite bowler’ @MdShami11 after #TeamIndia win the 2⃣nd #INDvNZ ODI 👍 👍 – By @ameyatilak
Full interview 🎥 🔽https://t.co/lALEGLjeZb pic.twitter.com/hy57SAtBf6
— BCCI (@BCCI) January 22, 2023