టీమిండియాపై గత కొన్ని రోజులుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. దానికి కారణం ఇటీవలి కాలంలో వరుస టోర్నీల్లో విఫలం అవుతూ వస్తోంది భారత జట్టు. దాంతో జట్టు కూర్పుపై ఇండియా మాజీ ప్లేయర్స్ సైతం తమ నోటికి పనిచెప్పుతున్నారు. ఈ నేపథ్యంలోనే బంగ్లాతో వన్డే సిరీస్ ను కోల్పోయిన భారత్ టెస్ట్ సిరీస్ కు సన్నద్ధం అయ్యింది. ఇక రెండు టెస్టు మ్యాచ్ ల్లో భాగంగా తొలి మ్యాచ్ చట్ గావ్ వేదికగా బుధవారం(డిసెంబర్ 14) ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ టీమిండియా ఆటగాళ్లకు కొన్ని సలహాలు, సూచనలు చేశాడు. యువ ఆటగాళ్లు అతడిని చూసి చాలా నేర్చుకోవాలని సూచించాడు.
రోహిత్ శర్మ చేతి వేలికి గాయం కావడంతో.. బంగ్లాదేశ్ తో జరిగే తొలి టెస్టుకు టీమిండియాకు కేఎల్ రాహుల్ సారథ్యం వహించనున్నాడు. ఇక వైస్ కెప్టెన్ గా సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా వ్యవహరించనున్నాడు. అయితే చాలా మంది పుజారాకు వైస్ కెప్టెన్సీ ఇవ్వడాన్ని తప్పు పట్టారు. ఈ క్రమంలోనే పుజారాపై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. భారత క్రికెట్ జట్టుకు పుజారా లాంటి సీనియర్, అనుభవం ఉన్న ప్లేయర్ చాలా అవసరం అని కైఫ్ అభిప్రాయ పడ్డాడు. గతంలో కొన్ని సిరీస్ లకు అతడిని ఎంపిక చేయకుండా పొరపాటు చేశారని కైఫ్ అన్నాడు. తాజాగా జరిగిన ఓ సమావేశంలో పుజారాపై ప్రశంసల వర్షం కురిపించాడు కైఫ్. కోహ్లీ, రోహిత్ ల కంటే టీమిండియా కుర్రాళ్లు పుజారా నుంచి చాలా నేర్చుకోవాలి అని సలహా ఇచ్చాడు.
“పుజారా తన ఆటతీరుతోనే సెలక్టర్లను తన దగ్గరికి రప్పించుకుంటాడు. గతంలో ఈ ఏడాది మెుదట్లో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ కు పుజారాను ఎంపిక చేయకుండా సెలక్టర్లు తప్పు చేశారు. ఇక పుజారా పేస్ తో పాటుగా స్పిన్ కు అనుకులంగా ఉండే మైదానాల్లో అద్భుతంగా రాణిస్తాడు. ఇక చాలా మంది అతడికి వయసు అయిపోయింది అంటున్నారు. కానీ ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే” అని కైఫ్ చెప్పుకొచ్చాడు. అదీకాక టెస్టు క్రికెట్ అంటే రోజుల తరబడి ఆడాలి. దానికి అనుభవం చాలా అవసరం పుజారా లాంటి సీనియర్లకు అనుభవం ఉంది కాబట్టి.. టెస్టుల్లో పుజారాను ప్రస్తుతం ఉన్న యువ ఆటగాళ్లు ఆదర్శంగా తీసుకోవాలని మహ్మద్ కైఫ్ సూచించాడు.
Former India batter #MohammadKaif has expressed astonishment seeing #CheteshwarPujara being named the ‘vice-captain’ for the opening Test between India and Bangladesh.#BANvINDhttps://t.co/g5AhCwgtcv
— CricketNDTV (@CricketNDTV) December 13, 2022
Mohammad Kaif Backs Cheteshwar Pujara Ahead Of Bangladesh Test, Says ‘Age Has Nothing To Do With Cricket’ #TeamIndia #INDvBAN #INDvAUS pic.twitter.com/q0GHmjv2AS
— Sohel Khan (@Sohel4Khan) December 13, 2022