BCCI Umpires Test: ఇప్పటివరకు నాణ్యమైన బ్యాటర్లు, బౌలర్ల కోసం వెతికిన బీసీసీఐ.. ఇప్పుడు అంపైర్ల కోసం వేట మొదలుపెట్టింది. క్రికెట్ గురుంచి తెలిసిన ప్రతోడు.. అంపైర్ అవుదామంటే కుదరదు అన్నట్లు గట్టిగానే బదులిచ్చింది. అంపైర్ల కోసం నిర్వహించిన లెవెల్ 2 పరీక్షలో.. తిక మక ప్రశ్నలతో వారిని ముప్పుతిప్పలు పెట్టింది.140 మంది పరీక్ష రాస్తే ముగ్గురు పాసవ్వడమే అందుకు నిదర్శనం. ఆ పరీక్షకు సంబంధించిన ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
బీసీసీఐ గత నెలలో అహ్మదాబాద్‌లో అంపైర్ల కోసం లెవల్-2 పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షను క్లియర్ చేసిన వారు గ్రూప్ D మ్యాచ్‌లకు అంటే.. మహిళల, జూనియర్ మ్యాచ్‌లు అఫిషియేట్ చేయడానికి అర్హులు. ఇది బీసీసీఐ ఎలైట్ అంపైర్‌గా మారడానికి, అంతర్జాతీయ మ్యాచులలో నిలబడటానికి మొదటి అడుగులాంటిది. మొత్తం 200 మార్కులకు పరీక్ష పెట్టారు. వ్రాత పరీక్షకు 100, వైవా, వీడియో కోసం 35 మరియు ఫిజికల్ టెస్టుకో 30.. ఇలా మూడు క్యాటగిరీలుగా మార్కులు కేటాయించారు. ఇందులో 90 మార్కులు సాధిస్తే క్వాలిఫై అయినట్లు. మొత్తానికి ఈ పరీక్షలో 140 మందికి ముగ్గురే పాసయ్యారు.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరలవడంతో.. నెటిజనులు బీసీసీఐపై ప్రశ్నల వర్షం కురిపించారు. వీరంతా రికమెండేషన్ క్యాండెట్లు అన్నట్లుగా ఫన్నీ మీమ్స్ సృష్టించారు. ప్రశ్నలు కూడా అందుకు తగ్గట్టే ఉండడంతో.. కొందరు వారిపై జాలి చూపిస్తున్నారు. ఆ పరీక్షలో అడిగిన కొన్ని ప్రశ్నలు మీకోసం..
ఇలా తిక మక ప్రశ్నలతో బీసీసీఐ వారిని బాగానే ఆటపట్టించింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
This is one of the 37 difficult questions, candidates had to crack to clear the Indian cricket board’s level-2 exam for umpires. Only 3 out of 140 candidates cleared the test.
Comment the correct answer below #cricket #umpire #icc #bcci #indiancricket pic.twitter.com/Z5uK8vyeHM— Sports Today (@SportsTodayofc) August 18, 2022
ఇదీ చదవండి: IND vs ZIM: వీడియో: జనగణమన పాడుతుండగా ఇషాన్ కిషన్ చెవిలో దూరిన తేనెటీగ..!
ఇదీ చదవండి: IPL vs PSL: పాకిస్థాన్ కొంపముంచిన ICC! ఇరకాటంలో పాకిస్థాన్ బోర్డు!