బౌలర్లకు శాపంగా.. బ్యాటర్లకు వరంగా మారిన రూల్ ఏంటంటే.. ఫ్రీ హిట్ డెలవరీ. గతంలో లేని ఈ రూల్.. టీ20 క్రికెట్ పుట్టిన తర్వాత.. క్రికెట్‌లోకి వచ్చి చేరింది. బ్యాటర్ల రాజ్యంగా మాట్లాడుకునే క్రికెట్‌లో ఈ రూల్‌తో బ్యాటర్లకు ఫ్రీగా ఒక షాట్ ఆడే అవకాశం దక్కింది. చాలా సార్లు బౌలింగ్ టీమ్‌కు ఈ ఫ్రీ హిట్ అనే గట్టి దెబ్బ కూడా వేసింది. మ్యాచ్ చివరి ఓవర్‌లో విజయ సమీకరణాలు ఈ ఫ్రీ హిట్ డెలవరీలు ఎంతో ప్రభావితం చేస్తాయి. ఫలితాలను తారుమారు సైతం చేస్తాయి. అలాంటి ఒక సంఘటన టీ20 వరల్డ్ కప్ 2022లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా కూడా చోటు చేసుకుంది. నో బాల్ డెలవరీకి కోహ్లీ సిక్స్ కొట్టగా తర్వాత బంతి ఫ్రీ హిట్ రూపంలో బోనస్‌గా లభించింది.
ఆ బాల్‌ను కోహ్లీ మిస్ చేసుకున్నాడు. బౌలర్ అద్భుతమైన యార్కర్‌తో కోహ్లీని బౌల్డ్ చేసినా.. ఫ్రీ హిట్ బాల్ కావడంతో కోహ్లీ అవుట్ కాగపోగా 3 రన్స్ అదనంగా బైస్ రూపంలో వచ్చాయి. అప్పటికీ టీమిండియా విజయానికి 3 బంతుల్లో 6 పరుగులు కావాలి. ఇలాంటి కీలక పరిస్థితిల్లో ఫ్రీ హిట్‌ను మిస్ చేసుకున్న కోహ్లీ.. సమయస్ఫూర్తి చూపిస్తూ.. బంతి వికెట్లకు తగిలినా.. మూడు పరుగులు రాబట్టుకున్నాడు. వికెట్లకు తగిలిన ఫ్రీ హిట్ బాల్ థర్డ్ మ్యాచ్ దిశగా వెళ్లింది. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తే విరాట్ కోహ్లీ.. తన పార్ట్నర్ దినేష్ కార్తీక్‌తో కలిసి.. మూడు పరుగులు ఉరిగాడు. దీంతో ఇక్వేషన్ 3 బంతుల్లో 3 పరుగులుగా మారిపోయింది.
అయితే.. బాల్ వికెట్లకు తగిలిన తర్వాత కూడా రన్స్ ఎలా తీస్తారని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ఫీల్డ్ అంపైర్‌తో వాదనకు దిగాడు. కానీ.. ఫ్రీ హిట్ రూల్స్ ప్రకారం ఫ్రీహిట్ బాల్ వికెట్లను తాకినా.. బ్యాటర్ బౌల్డ్ అయినా అది అవుట్ కాదని.. బైస్ రూపంలో పరుగులు తీసుకోవచ్చని అంపైర్ వివరించి చెప్పడంతో పాక్ ఆటగాళ్లు తిరిగి వారివారి స్థానాలకు వెళ్లిపోయారు. కానీ.. ఫ్రీహిట్ బాల్ వికెట్లకు తగిలిన తర్వాత దాన్ని డెడ్‌బాల్‌గా పరిగణించాలని.. బ్యాటర్‌ను అవుట్ ఇవ్వకపోయినా.. బాల్ ముగిసినట్లు రూల్స్ మార్చాలనే వాదనలు క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు, క్రికెట్ నిపుణులు, మాజీలు సైతం వినిపించారు. తాజాగా అలాంటి ఒక కొత్త రూల్‌ను సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రవేశపెట్టింది.
త్వరలో సౌతాఫ్రికా వేదికగా ప్రారంభం కానున్న ‘సౌతాఫ్రికా టీ20 లీగ్’లో నో బాల్, ఫ్రీ హిట్ డెలవరీస్‌పై కొన్ని మార్పులు చేశారు. ఫ్రీ హిట్ బాల్ బ్యాటర్ వికెట్లను తాకితే.. దాన్ని అక్కడితో డెడ్ బాల్‌గా పరిగణించనున్నారు. దీంతో బ్యాటర్ రన్స్ తీయడానికి వీలులేదు. అయితే.. ఈ రూల్ అంతర్జాతీయ క్రికెట్‌కు కాదు.. కేవలం సౌతాఫ్రికా టీ20 లీగ్ వరకు మాత్రమే. అయితే.. ఇదే రూల్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఉండి ఉంటే.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమిండియ విజయావకాశాలు దెబ్బతిని ఉండేవి. కానీ.. కోహ్లీ స్ట్రైక్‌లోనే ఉండేవాడు. మరి ఈ కొత్త రూల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Bowler hits stumps on a free-hit? No run in the SA20 ❌
Who is in favour? 🤔
▶️ https://t.co/kOduSI8i1T #SA20 pic.twitter.com/hB6ZAevd7m
— ESPNcricinfo (@ESPNcricinfo) January 10, 2023