టీమిండియా మరో అద్భుత విజయాన్ని సాధించింది. న్యూజిలాండ్‌తో అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన మూడో టీ20లో భారత జట్టు 168 రన్స్ తేడాతో భారీ విక్టరీ కొట్టింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో హార్దిక్ పాండ్యా సేన చేజిక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 235 రన్స్ చేసింది. మన బ్యాట్స్‌మెన్‌లో శుబ్‌మన్ గిల్ (126 నాటౌట్) సెంచరీతో వీరవిహారం చేశాడు. అయితే భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పర్యాటక కివీస్ జట్టు 66 రన్స్‌కే ఆలౌటైంది. భారత బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లతో న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు.
యువ పేసర్లు ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, శివం మావి చెరో రెండు వికెట్లతో ప్రత్యర్థి పనిపట్టారు. ఇదిలాఉంటే.. ఈ సిరీస్‌లో ఓ ప్లేయర్‌ను ఆడించకపోవడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. రంజీల్లో అద్భుతమైన ప్రదర్శనతో జాతీయ జట్టులోకి పునరాగమనం చేసిన పృథ్వీ షాకు మెయిన్ టీమ్‌లో చోటు దక్కలేదు. ఓపెనర్‌గా పృథ్వీ షాను ఆడిస్తారనుకుంటే అతడికి ఒక్క మ్యాచులోనూ చాన్స్ ఇవ్వలేదు. శుబ్‌మన్ గిల్ మూడో టీ20లో సెంచరీ కొట్టి ఓపెనర్‌గా తానేంటో నిరూపించుకున్నాడు. అయితే మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ మాత్రం వరుసగా విఫలమవుతున్నాడు.
గత 10 టీ20ల్లో ఇషాన్ కిషన్ కేవలం 129 రన్స్ మాత్రమే చేయగలిగాడు. దీంతో అతడిపై విమర్శలు ఊపందుకున్నాయి. ఇషాన్ కిషన్ స్థానంలో పృథ్వీకి ఒక్క చాన్స్ అయినా ఇవ్వాలని ప్రేక్షకులు, మాజీ క్రికెటర్ల నుంచి డిమాండ్లు వచ్చాయి. మూడో టీ20లో అతడికి అవకాశం ఇస్తారనుకుంటే మళ్లీ ఇషాన్ వైపే టీమ్ మేనేజ్‌మెంట్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొగ్గుచూపారు. దీంతో పృథ్వీ షా బెంక్‌కే పరిమితం అయ్యాడు. టాలెంట్ ఉన్న పృథ్వీ షాను తొక్కేస్తున్నాని.. ఫామ్‌లో లేకపోయినా ఇషాన్ కిషన్‌ను ఆడిస్తున్నారంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం పాండ్యా దృష్టికి వచ్చిందో ఏమో తెలియదు గానీ.. మ్యాచ్ విజయం తర్వాత అతడు చేసిన ఓ పని నెట్టింట వైరల్‌గా మారింది.
కప్ అందుకున్న పాండ్యా దాన్ని నేరుగా తీసుకొచ్చి పృథ్వీ షా చేతుల్లో పెట్టాడు. మీదకు నవ్వుతున్నట్లుగా కనిపించినా.. పృథ్వీ షా లోలోపల ఆశ్చర్యానికి గురయినట్లున్నాడు. రంజీల్లో తాను రాణించినా తుది జట్టులో చోటు కల్పించలేదనే బాధ పృథ్వీ షాలో ఏ మూలనో ఉండే ఉంటుందని పాండ్యా పసిగట్టాడేమో! మొత్తానికి పాండ్యా తెలివిగా షా చేతికి ట్రోఫీని అందించి అతడ్ని కూల్ చేసేందుకు ప్రయత్నించడం ఆసక్తి కలిగగించింది. మరి, పృథ్వీ షా చేతికి పాండ్యా ట్రోఫీని అందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Captain @hardikpandya93 collects the @mastercardindia trophy from BCCI president Mr. Roger Binny & BCCI Honorary Secretary Mr. Jay Shah 👏👏
Congratulations to #TeamIndia who clinch the #INDvNZ T20I series 2️⃣-1️⃣ @JayShah pic.twitter.com/WLbCE417QU
— BCCI (@BCCI) February 1, 2023