సెలబ్రిటీల పిల్లల గురించి తెలుసుకోవాలని వారి అభిమానులే కాక.. సామాన్యలు కూడా ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం కాలంలో సెలబ్రిటీల పిల్లలు కూడా చిన్న వయసులోనే తెగ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ఇందుకు కారణం సోషల్ మీడియా. ఇక నిన్నంతా గంగూలీ కుమార్తె గురించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వివారలు..
సాధారణంగా సెలబ్రిటీల పిల్లలకు సంబంధించిన విషయాల గురించి జనాలకు విపరీతమైన ఆసక్తి ఉంటుంది. వారు ఏం చేస్తున్నారు.. ఎక్కడ చదువుతున్నారు ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవడానికి జనాలు ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం ఉన్నది సోషల్ మీడియా యుగం కాబట్టి.. సెలబ్రిటీలు మాత్రమే కాదు.. వారి పిల్లలు కూడా చిన్న వయసు నుంచే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ.. వారికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ హల్చల్ చేస్తుంటారు. ఈ క్రమంలో నిన్నంతా వెబ్ సైట్లు, సోషల్ మీడియాలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కుమార్తె సనా గంగూలీ గురించే జోరుగా చర్చ నడించింది. కారణం.. ఓ వైపు చదువుకుంటూనే గంగూలీ కుమార్తె.. ఉద్యోగం చేస్తోంది. దాంతో సనా గంగూలీ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
ఈ క్రమంలో కొందరు సచిన్ కుమార్తె సారా టెండుల్కర్‌ని, సనా గంగూలీని పోలిస్తూ.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ అని చర్చించుకుంటున్నారు. వీరిలో సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్. అయితే గంగూలీ కుమార్తె మాత్రం ఇందుకు భిన్నం. ఆమె సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తోంది. దాంతో సనా గంగూలీ గురించి తెలుసుకోవడానికి జనాలు ఎక్కువ ఆసక్తి కనబరిచారు. వీరిద్దరికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇండియన్ క్రికెట్ దేవుడిగా గుర్తింపు పొందిన సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండుల్కర్. 1997, అక్టోబర్ 12న జన్మించింది. ధీరుబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది సారా. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. హల్చల్ చేస్తుంటుంది. ఇక సారా చాలా అందంగా ఉంటుంది. దాంతో ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుందనే వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వీటికి తోడు.. శుభమాన్ గిల్‌తో సారా డేటింగ్‌లో ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక ఆమె మోడలింగ్ చేస్తోంది అనే వార్తలు వచ్చాయి. సారా ఎక్కువగా తన ఫొటోషూట్‌లు, డేటింగ్ వార్తలతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది. ఇక ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రేంజ్‌లో ఫాలోవర్లు ఉన్నారు.
భారత మాజీ కెప్టెన్ గంగూలీ ముద్దుల తనయ సనా గంగూలీ. తల్లి మాదిరిగానే ఆమెకు నాట్యం అంటే ఇష్టం. ఇక సనా గంగూలీ 2001, నవంబర్ 3న జన్మించింది. సారా కన్న నాలుగేళ్లు చిన్నది. కోల్‌కతాలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసుకుంది. యూనివర్సిటీ కాలేజ్ లండన్ నుంచి ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేయడానికి లండన్ వెళ్లింది. చదువుతో పాటు ఎనాక్టస్ యూసీఎల్‌లో పని చేస్తోంది. సనా లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. ఆమె 2022 జూన్ నుంచి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక సలహా కంపెనీలలో ఒకటైన పీడబ్ల్యూసీలో ఇంటర్న్‌గా పని చేస్తోంది. ప్రస్తుతం సనా చదువు పూర్తి కాకుండానే.. ఏడాదికి 30 లక్షల జీతం ఆర్జిస్తోంది.
ఇక సారాతో పోలిస్తే.. సనా సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తుంది. కుటుంబం, ఫ్రెండ్స్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తుంది. సనా చిన్నప్పుడు నృత్య ప్రదర్శనలు ఇచ్చి.. వార్తల్లో నిలిచింది. సనా తల్లి కూడా డ్యాన్సర్. వీరిద్దరూ 2019 హోలీ సందర్భంగా ఒడిస్సీ నృత్య ప్రదర్శన ఇచ్చారు. డ్యాన్స్‌లో తల్లిని మించిన తనయ అంటూ ప్రశంసలు కురిపించారు.
ఇక స్టార్ క్రికెటర్ల కుమార్తెలిద్దరూ ఎవరికి నచ్చిన రంగంలో వారు దూసుకుపోతున్నారు. సారా సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారితే.. సనా అప్పుడే ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలం అయ్యే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. స్టార్ క్రికెటర్ల కుమార్తెలిద్దరూ తమకు నచ్చిన కెరీర్‌లో ఉన్నత విజయాలు అందుకునే దిశగా సాగుతున్నారు. మరి వీరద్దరిలో మీకు ఎవరి కెరీర్ బాగుంది అనిపించింది.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.