వచ్చే ఐపీఎల్ సీజన్లో ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టును వీడనున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. ఐపీఎల్ 2022లో కొత్తగా వచ్చే జట్లలో ఒక దానికి ధోని కెప్టెన్‌గా వెళ్లనున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. ధోని కూడా వచ్చే ఏడాదికి చెన్నైలో ఉండేది అనుమానమే, మెగా ఆక్షన్, కొత్త రిటైన్ నిబంధనలు చాలా గందరగోళంగా ఉన్నాయి అని అనడంతో ధోని సీఎస్కేను వీడడం ఖాయంగా కనిసిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. వీటన్నిటికీ తెరదించుతూ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది.
వచ్చే సీజన్‌కు కూడా ధోనినే తమ జట్టుకు కెప్టెన్‌గా ఉంటాడని, ధోనిని మేము వదులుకోం అంటూ ప్రకటించింది. దీంతో సీఎస్కే అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎస్కేకు అంత ఫ్యాన్ బేస్ ఉండడానికి ప్రధాన కారణం ఎంఎస్ ధోనినే. కెప్టెన్‌గా ఆ జట్టును ఐపీఎల్ ప్రారంభం నుంచి నడిపిస్తున్నాడు. మధ్యలో ఒక రెండు సీజన్లు ఆ జట్టు నిషేధం ఎదుర్కొన్నా కూడా అనంతరం మళ్లీ ధోనినే ఆ జట్టును నడిపించాడు.