టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్‌కు రెండు వరల్డ్ కప్పులతో పాటు మూడు ప్రతిష్టాత్మక ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా అతనికి పేరుంది. ఒక దశాబ్దానికి పైగా భారత క్రికెట్‌ను శాసించిన కెప్టెన్‌గా ధోని చరిత్రలో నిలిచిపోతాడు. అయితే.. ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తి తప్పుకుని రెండేళ్లకు దాటిపోతున్నా.. అతనిపై క్రికెట్ అభిమానులకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు జట్టులో ఉన్న స్టార్ క్రికెటర్లుకు పోటీ ఇస్తుంది.. ధోని క్రేజ్. 2014లోనే టెస్టు క్రికెట్ నుంచి తప్పకున్న ధోని.. ఆ తర్వాత 2017లో కెప్టెన్సీ సైతం వదిలేసి.. 2020లో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.
ఇలా ఆట నుంచి తప్పుకున్నా.. ధోని అంటే పడిచచ్చే క్రికెట్ అభిమానులు కోట్లలో ఉన్నారు. ధోని ఐపీఎల్‌లో ఆడుతున్నా.. ఇండియా మ్యాచ్‌లు ఆడే సమయంలోనూ ధోని స్మరణతో క్రికెట్ స్టేడియాలు ఊగిపోతున్నాయి. తాజాగా.. భారత్-శ్రీలంక మూడో వన్డే సందర్భంగా కూడా ధోని టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్‌గా మారిపోయాడు. అందుకు కారణం.. ఇండియా-శ్రీలంక మూడో వన్డే ఆడే స్టేడియం బయట.. ధోనిది 50 అడుగుల కటౌట్ ఉండటమే కారణం. ఈ భారీ కటౌట్‌ను తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ క్రికెట్ స్టేడియం బయట ఆటగాళ్లు వచ్చే దారిలో ఏర్పాటు చేశారు. ఆల్ కేరళ ధోని ఫ్యాన్స్ అసోసియేషన్ ఈ కటౌట్‌ను పెట్టింది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన క్రికెట్ అభినులను ఈ కటౌట్ విపరీతంగా ఆకర్షిస్తోంది. అలాగే శ్రీలంక ఆటగాళ్లు సైతం టీమ్‌లో లేకపోయినా.. ధోని క్రేజ్ చూసి ఆశ్చర్యపోతున్నట్లు సమాచారం. ఇక ధోనితో పాటు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కటౌట్‌ను కూడా కోహ్లీ ఫ్యాన్స్ ఏర్పాటు చేశాడు.
గతంలో ఒక్కడ మ్యాచ్ జరిగిన సమయంలోనూ కోహ్లీ, రోహిత్ శర్మ, సంజు శాంసన్ కటౌట్లను వారివారి అభిమానులు ఏర్పాటు చేశారు. ఈ సారి ధోని కటౌన్‌ను కూడా ఏర్పాటు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఆదివారం జరగనున్న చివరి వన్డేలో టీమిండియా టాస్ గెలిచ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఆడనున్నారు. హార్దిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్‌లకు రెస్ట్ ఇచ్చి.. వారిద్దరిని ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకున్నాడు కెప్టెన్ రోహిత్. ఈ మ్యాచ్‌లో గెలిచి మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుంటే.. కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలిచి.. సిరీస్‌ను ముగించాలని లంక సేన పట్టుదలతో ఉంది. మరి ఈ మ్యాచ్ సంగతి ఎలా ఉన్నా.. స్టేడియం బయట ధోని కటౌట్ ఏర్పాటు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
MS Dhoni’s 50 feet cut-out outside Greenfield International Stadium in Thiruvananthapuram, ahead of the 3rd ODI between India and Sri Lanka.#MSDhoni #Kerala #Thiruvananthapuram #INDvsSL #CricTracker pic.twitter.com/UmlK6guYfT
— CricTracker (@Cricketracker) January 15, 2023
Cut-out of King Kohli in Greenfield Stadium. pic.twitter.com/Zo3LAuySSi
— Johns. (@CricCrazyJohns) January 14, 2023