నేడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు. దీంతో క్రికెట్ అభిమానులు, ప్రముఖ క్రీడాకారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు యువ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్. ఇన్ స్టా గ్రామ్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన సిరాజ్ కోహ్లీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు.
నీలాంటి అన్నయ్యను పొందడం నేను ఎంతో అదృష్టవంతుడిని. మీరు నా జీవితంలోకి వచ్చి నాకు అన్ని విషయాల్లో నాకు తోడుగా ఉన్నందుకు చాలా ధన్యవాదాలు. మీ జీవితంలో మీరు కోరుకున్నవన్నీ పొందాలని నేను ఆశిస్తున్నాను. కింగ్ విరాట్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మహమ్మద్ సిరాజ్ పోస్ట్ చేశాడు. తాజాగా సిరాజ్ చేసిన వైరల్ గా మారుతోంది. అయితే మహమ్మద్ సిరాజ్ చేసిన పోస్టుకు ఆయన అభిమానులు కూడా విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టులో కోహ్లీ సారధ్యంలో మహ్మద్ షిరాజ్ కీలక ఆటగాడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.