భారత్, ఆస్ట్రేలియా మధ్య మాట్లా యుద్ధం ఉండడం సహజమే. ఆటగాళ్లను స్లెడ్జింగ్ చేయడం ఆసీస్ తర్వాతే ఎవరైనా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా.. డబ్ల్యూటీసీ ఫైనల్లో అలాంటి ఆసీస్ బ్యాటర్ స్మిత్ బౌలర్ సిరాజ్ కి విసుగు తెప్పించాడు.
డబ్ల్యూటీసీలో భాగంగా ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ జరుగుతోంది. ఇంగ్లాండ్ లోని ఒవెల్ లో జరుగుతున్న ఈ మ్యాచులో ఆసీస్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. 327 పరుగులకే 3 వికెట్లతో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన కమ్మిన్స్ సేన.. కొద్దిసేపటికే హెడ్ వికెట్ కోల్పోయింది. ఇక ఓవర్ నైట్ స్కోర్ 95 పరుగులు వద్ద ఉన్న స్మిత్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం లంచ్ సమయానికి ఆస్ట్రేలియా 7 వికెట్లను 422 పరుగులు చేసింది. వికెట్ కీపర్ క్యారీ(22) కమ్మిన్స్ (2) గ్రీజ్ లో ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ మ్యాచులో స్మిత్ చేసిన ఒక పనికి మహమ్మద్ సిరాజ్ కి కోపమొచ్చింది. అంతే కాదు టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేసాడు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య మాట్లా యుద్ధం ఉండడం సహజమే. ఆటగాళ్లను స్లెడ్జింగ్ చేయడం ఆసీస్ తర్వాతే ఎవరైనా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా.. డబ్ల్యూటీసీ ఫైనల్లో అలాంటి ఆసీస్ బ్యాటర్ స్మిత్ బౌలర్ సిరాజ్ కి విసుగు తెప్పించాడు. ఇక పూర్తి వివారాల్లోకెళ్తే.. ఇన్నింగ్స్ 86 ఓవర్ సిరాజ్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. మూడో బంతికి సిరాజ్ బౌలింగ్ వేస్తుండగా స్మిత్ పక్కకి తప్పుకున్నాడు. దీంతో సిరాజ్ కి చిర్రెత్తిపోయిన సిరాజ్.. బంతిని స్మిత్ వైపుకి కోపంగా విసిరాడు. స్మిత్ చేసిన పనికి కెప్టెన్ రోహిత్ శర్మ సైతం షాకయ్యాడు.
అయితే గ్రౌండ్ లో ఉన్న స్పైడర్ కెమెరా తనకు అడ్డు రావడంతోనే ఇలా చేశానని స్మిత్ వివరణ ఇచ్చినా.. సిరాజ్ పట్టించుకోలేదు. నేను రనప్ తీసుకోకముందే ఆపి ఉంటె బాగుండు కదా అని అసహనం వ్యక్తం చేసాడు. స్మిత్ సైలెంట్ గా ఉండడంతో పెద్దగా మాటల యుద్ధమేమీ జరగలేదు. ఇక ఈ మ్యాచులో సెంచరీ చేసిన స్మిత్.. భారత్ పై టెస్టుల్లో రెండు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక భారత్ పై 9 సెంచరీలు చేసి రూట్ తో కలిసి సంయుక్తంగా అగ్ర స్థానంలో ఉన్నాడు. మొత్తానికి అసలే వికెట్ పడక ఇబ్బంది పడుతున్న భారత బౌలర్లకు స్మిత్ కూల్ గా సిరాజ్ సహనాన్ని పరీక్షించాడు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.