న్యూజిలాండ్‌తో మంగళవారం ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్ తర్వాత టీమిండియా ఆటగాళ్ల మధ్య ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా స్పీడ్‌స్టర్ మన హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ మొహమ్మద్ సిరాజ్.. స్పిన్ సంచలనం కుల్దీప్ యాదవ్‌కు ఏదో వార్నింగ్ ఇస్తూ కనిపించాడు. అదే టైమ్‌లో మరో స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సైతం కుల్దీప్ యాదవ్ చెవులను గట్టిగా పిండుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు సిరాజ్.. కుల్దీప్‌కు ఎందుకు, ఏమని వార్నింగ్ ఇస్తున్నాడు? చాహల్ ఎందుకు కుల్దీప్ చెవులు పిండుతున్నాడు? అంటూ నెటిజన్లు తెగ హైరాన పడిపోతున్నారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో కామెంటేటర్లు మాట్లాడుతున్న సమయంలో ఒక చోట కూడిన చాహల్, కుల్దీప్, సిరాజ్‌లు ఏందో విషయంలో మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో కుల్దీప్, సిరాజ్ వైపు తిరిగి మాట్లాడుతుండగా.. వెనుకనుంచి చాహల్, కుల్దీప్ రెండు చెవులు పట్టుకుని గట్టిగా పించేశాడు. సిరాజ్ కూడా వేలు చూపిస్తూ.. కుల్దీప్‌కు వార్నింగ్ ఇస్తున్నట్లు కనిపించాడు. అయితే.. ఇదంతా ఆటగాళ్ల మధ్య సరదాగా జరిగిన విషయమని.. ఇందులో అంత సీరియస్ ఏం లేదని సమాచారం. కుల్దీప్‌ను చాహల్ అప్పుడప్పుడు ఇలా ఆటపట్టిస్తుంటాడు. ఇప్పుడు వీరికి సిరాజ్ కూడా తోడైనట్లు కనిపిస్తోంది. ఈ యువ ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో ఎంతో సరదా సరదాగా ఉంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ సెంచరీలతో చెలరేగగా.. మిడిల్డార్ విఫలమైనా.. చివర్లో హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీతో రాణించడంతో టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. బదులుగా న్యూజిలాండ్ 295 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 90 పరుగుల తేడాతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 3-0తో కైవసం చేసుకుని.. న్యూజిలాండ్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్ విజయంతో టీమిండియా వన్డే క్రికెట్‌లో నంబర్ వన్ టీమ్‌గా అవతరించింది. ఇప్పటికే టీ20ల్లో నంబర్ వన్ జట్టుగా ఉన్న భారత్.. ఇప్పుడు వన్డేల్లోనూ అగ్రస్థానానికి చేరుకుంది. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో మూడు విజయాలు సాధించి.. మళ్లీ ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో విజయం సాధిస్తే.. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా నంబర్ వన్‌గా ఉంటుంది. మ్యాచ్ సంగతి ఎలా ఉన్నా.. మ్యాచ్ తర్వాత.. కుల్దీప్, చాహల్, సిరాజ్ మధ్య జరిగిన ఆసక్తికర సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— LePakad7 (@AreBabaRe2) January 24, 2023