ఇటివల కొందర దిగ్గజ క్రికెటర్లు ఆటకు వీడ్కోలు పలుకుతున్నారు. ఈ వరుసలో తాజాగా పాకిస్థాన్ ఆల్ రౌండర్, మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ రిటైర్మెంట్ కూడా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి అధికారికంగా తన నిర్ణయం ప్రకటించాడు. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలికాడు మహ్మద్ హఫీజ్. పాకిస్థాన్ తరపున విజయవంతమైన ఆటగాళ్లలో హఫీజ్ ఒకడు. అంతర్జాతీయ వేదికపై అతని చివరి టోర్నమెంట్ 2021 టీ20 ప్రపంచ కప్‌గా నిలిచింది. ఇందులో సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అతను చివరిసారిగా ఆడాడు. ఏప్రిల్ 2003లో జింబాబ్వేతో జరిగిన వన్డేల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
దీని తర్వాత ఆగస్టు 2003లో టెస్ట్ అరంగేట్రం, ఆగస్టు 2006లో టీ20 అరంగేట్రం చేశాడు. మహ్మద్ హఫీజ్ 2018 డిసెంబర్‌లో చివరి టెస్టు, 2019 జూలైలో చివరి వన్డే, నవంబర్ 2021లో చివరి టీ20 ఆడాడు. 2021 టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. 41 ఏళ్ల హఫీజ్ 218 వన్డేల్లో 11 సెంచరీల సాయంతో 6614 పరుగులు చేసి 139 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో 55 టెస్టుల్లో 10 సెంచరీలతో 3652 పరుగులు చేసి 53 వికెట్లు పడగొట్టాడు. 119 టీ20 మ్యాచుల్లో 2514 పరుగులు చేసి 61 వికెట్లు తీశాడు. మరి హఫీజ్ రిటైర్మెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Just in: Pakistan allrounder Mohammad Hafeez has decided to retire from international cricket pic.twitter.com/maPbFvkq8i
— ESPNcricinfo (@ESPNcricinfo) January 3, 2022