మస్కట్‌లో జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్- 2022 క్రికెట్ లవర్స్ ని ఆకట్టుకుంటుంది. ఇందులో భాగంగా.. ఈ శనివారం మహారాజా, వరల్డ్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా మహారాజా 20 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగులు చేసింది. 210 పరుగుల లక్ష్యాన్ని ప్రపంచ జెయింట్స్ 19.3 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి ఛేదించింది. ఈ లెజెండ్స్ లీగ్ లో ఇది ఇండియా మహారాజాకు తొలి ఓటమి కాగా వరల్డ్ జెయింట్స్‌కు తొలి విజయం.
ఇది కూడా చదవండి:
క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ నేరం కాదు.. కోర్టు సంచలన తీర్పు
ఇండియా మహారాజా తరఫున ఓపెనర్ నమన్ ఓజా విధ్వంసకరమైన బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. ఓజా 69 బంతుల్లో 15 ఫోర్లు, 9 సిక్సర్లతో 140 పరుగులుచేయడం విశేషం. కానీ.., భారత మహారాజా బౌలర్లు రాణించకపోవడంతో ఓజా వీరోచిత పోరాటం వృధా అయ్యింది. వరల్డ్ జెయింట్స్ జట్టు మూడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది.
What a knock by Naman Ojha in Legends League Cricket. #NamanOjha #IndiaMaharajas #LegendsLeagueCricket #T20 #Cricket #BetBarter #Socialmedia pic.twitter.com/Vd1qPWqXSx
— Bet Barter (@BetBarteronline) January 23, 2022
పీటర్సన్, ఇమ్రాన్ తాహిర్ లు తమ ఆటతో వరల్డ్ జెయింట్స్ ను గెలిపించారు. ఒకనొక సమయంలో 130 పరుగులకే 6 వికెట్ల కోల్పోయిన జెయింట్స్‌కు ఓటమి తప్పదు అని అంతా భావించారు. కానీ.., తాహిర్ తుపాన్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఇమ్రాన్ తాహిర్ 19 బంతుల్లో 52 పరుగులు, పీటర్సన్ 27 బంతుల్లో 53 పరుగులు చేసి తమ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. కానీ.., మ్యాచ్ మొత్తం మీద ఓజా బ్యాటింగ్ హైలెట్ గా నిలవడం విశేషం.
Imran Tahir, the new finisher 😂♥️ #LegendsLeagueCricket pic.twitter.com/OMmTDNZGP5
— Cricket Page (@CricketPage3) January 23, 2022