ఇటీవల కాలంలో ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తున్నాయో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. భూమిపైనే కాదు ఆకాశంలో కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరిన విమానాలు టేకాఫ్ అయిన కొద్దిసేపటికీ ఏదో ఒక ప్రమాదం జరగడం.. వందల సంఖ్యలో ప్రయాణీకులు చనిపోవడం చూస్తూనే ఉన్నాం..
ఈ మద్య ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో విమాన ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. టెక్నికల్ కారణాలు, ఇతర ఏ కారణాలైనా కావొచ్చు.. గాల్లో ఉన్న ప్రాణాలు గాల్లోనే కలిసిపోతున్నాయి. ఎయిర్ పోర్ట్ నుంచి టాకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదాలు జరగడం.. వెంటనే వాటిని గమనించిన పైలెట్లు సమయస్ఫూర్తితో ఎమర్జెన్సీ ల్యాండ్ చేయడం తో వందల మంది ప్రాణాలు రక్షించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా 200 మందితో బయలు దేరిన ఓ విమానం ఇంజన్ లో పొగలు రావడంతో పైలట్ అత్యవసరంగా ల్యాండింగ్ చేసి ప్రాణాలు రక్షంచాడు. వివరాల్లోవెళితే..
నాగపూర్ లోని సలామ్ ఎయిర్ పోర్ట్ లో ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్ చేశారు. బంగ్లాదేశ్ లోని చిట్టాగాంగ్ నుంచి మస్కట్ బయలుదేరిన విమానం టేకాఫ్ కాగానే ఇంజన్ లో పొంగలు రావడాన్ని పైలట్ గుర్తించాడు. అధికారులు తెలియజేసిన తర్వాత విమానాన్ని మహారాష్ట్రలోని నాగ్ పూర్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఆ విమానంలో 200 మంది ప్రయాణీకులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. చిట్టాంగ్ నుంచి మస్కట్ బయలుదేరిన కొద్ది సేపటికే ఇంజన్ లో పొగలు రావడం గమనించి పైలెట్ నాగ్ పూర్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాల్సి వచ్చిందిని.. ఈ ఘటనలో అందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు.
గత నెల ఫిబ్రవరి 27 న కోల్ కొతా నుంచి బ్యాంకాక్ వెళ్తున్న స్పైస్ జెట్ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో వెంటనే కోల్ కొతా ఎయిర్ పోర్ట్ లో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో విమానంలో 178 మంది ప్రయాణీకులు ఉన్నారు. అంతకు ముందు నెవార్క్ నుంచి ఢిల్లీ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో హుటాహుటిన స్వీడన్ లోని స్టాక్ హూమ్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 300 మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలిపారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఆయిల్ లీక్ కావడంతో మంటలు చెలరేగే అవకాశం ఉందని.. పైలెట్లు అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు తెలిపారు. ఏది ఏమైనా ఇలాంటి ప్రమాదాలు పైలెట్లు ముందుగానే గ్రహించడం వల్ల వందల మంది ప్రాణాలు రక్షించినవారవుతున్నారు.
Maharashtra | A SalamAir flight (Chittagong-Muscat) made an emergency landing at Nagpur airport last night after the pilot detected smoke emitting from the engine. The flight was carrying around 200 passengers and seven crew members. All of them are safe: Airport official
— ANI (@ANI) March 2, 2023