ఎవరైనా ప్లేయర్ బాగా ఆడుతున్నాడంటే ఏం చేస్తారు? సదరు టీమ్ మేనేజ్ మెంట్ ఆ ప్లేయర్ కు అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేస్తుంది. కానీ టీమిండియా విషయంలో దానికి భిన్నంగా జరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తాజాగా నాగ్ పూర్ లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుంది. అయితే ఈ మ్యాచులో ఓపెనర్స్ గా రోహిత్ తోపాటు కేఎల్ రాహుల్ సెలెక్ట్ అయ్యాడు. చాలామంది ఇది చూసి షాకయ్యారు. ఎందుకంటే గత కొన్నాళ్ల నుంచి చూసుకుంటే ఓపెనర్ గా గిల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అతడిని కాదని రాహుల్ కు జట్టులోకి చోటివ్వడంపై పలు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో టీమిండియా కచ్చితంగా గెలవాలి. అప్పుడే టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్తుంది. దానికోసం బ్యాటర్లు అందరూ కచ్చితంగా రాణించాలి. మ్యాచ్ ప్రారంభానికి ముందు మాజీలు అందరూ గిల్ కు ఓపెనర్ గా తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. మేనేజ్ మెంట్ మాత్రం కేఎల్ రాహుల్ కే ఓటేసింది. ప్రస్తుతం భారత జట్టులో ఒక్కో స్థానానికి ముగ్గురు, నలుగురు ప్లేయర్స్ పోటీ పడుతున్నారు. గిల్ అయితే కెరీర్ పీక్స్ లో ఉన్నాడు. గత రెండు నెలల్లో మూడు ఫార్మాట్లలో సెంచరీలు కొట్టి తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇదే విషయమై మ్యాచ్ కు ముందు స్పందించిన రాహుల్ కూడా గిల్ ఓపెనర్ గా వెళ్తే.. మిడిలార్డర్ లో ఆడటానికి తనకు ఏం ఇబ్బంది లేదని అన్నాడు. కానీ గిల్ ని పక్కనబెట్టేసి ఇప్పుడు రాహుల్ ని ఓపెనర్ గా ఎంపిక చేశారు.
టెస్టు జట్టులోకి స్పెషలిస్టుగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్.. ఈ ఫార్మాట్ లో పెద్దగా ఆకట్టుకునే ఇన్నింగ్స్ లు అయితే ఆడలేకపోయాడు. గతేడాది దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో సెంచరీ చేసిన రాహుల్.. ఆ తర్వాత మ్యాచుల్లో మాత్రం పూర్తిగా ఫెయిలయ్యాడు. ఫ్యాన్స్ గానీ, విశ్లేషకులు గానీ రాహుల్ ని బ్యాటర్ గా అస్సలు చూడటం లేదు. ఎందుకంటే టెస్టుల్లో రాహుల్ యావరేజ్ 34.36 మాత్రమే. బహుశా సీనియర్ కావడం, స్వదేశంలో అనుభవం ఎక్కువగా ఉండటం వల్లనే రాహుల్ కి తొలి టెస్టులో ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచులో రాహుల్ ప్రదర్శన బట్టి.. తర్వాత మ్యాచుల్లో కొనసాగిస్తారా లేదనేది తెలిసిపోతుంది.
ఐపీఎల్ లో తప్పితే గత రెండేళ్లలో కేఎల్ రాహుల్ అస్సలు ఫామ్ లో లేడు. చాలా దారుణంగా ఆడుతూ విమర్శల పాలవుతున్నాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్ లోనూ రాహుల్ ఆటవల్లే మన జట్టు ఓడిపోయిందని అప్పట్లో తెగ ట్రోల్స్ వినిపించాయి. ఈ క్రమంలోనే అతడిని టీ20 జట్టు నుంచి తప్పించారు. వన్డేల్లో వైస్ కెప్టెన్సీ నుంచి తీసేశారు. ఇదంతా చూస్తుంటే పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో కేఎల్ రాహుల్ విషయంలో సెలెక్టర్లకు కూడా ఓపిక నశించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆస్ట్రేలియా సిరీస్ లోనూ రాహుల్ ఫెయిలైతే.. టెస్టు జట్టులోనూ చోటు ప్రశ్నార్థకమవుతుంది. అలా సూపర్ ఫామ్ లో ఉన్న గిల్ ని కాదని రాహుల్ ని జట్టులో ఎంపిక చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై మీరేం అంటారు. కింద కామెంట్స్ లో మీ ఓపెనియన్ చెప్పండి.
Century in his last test match , century in his last ODI and century in his last T20I , what more can he do 🤬
No question that he is far better than KLOL and still we play that guy , even I believe SKY is not a good red ball player but we’ll see
But Gill should’ve played 🤬🤬 pic.twitter.com/bWs50KVKT4
— Abhishek 🇦🇷 (@Abhi_Kohli123) February 9, 2023