ప్రధాని మోదీ పేరు వాడుకుని ఓ వ్యక్తి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చూసేందుకు సూటూ బూటు వేసుకుని పెద్ద మనిషిలా కనిపించినా.. వాడో కిలాడీ గాడు. ఇంటిలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో అతనిప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
పోలీసులకు దొరకకుండా వాళ్ల కళ్లుగప్పి మోసాలు, నేరాలు చేసే వాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ.. ఇతను మాత్రం ఏకంగా పోలీసులు, ఆర్మీనే దారుణంగా మోసం చేశాడు. ఈ మోసానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేరు వాడుకున్నాడు. తాను ప్రధాని మోదీ కార్యాలయంలో పెద్ద అధికారినంటూ.. ఏకంగా జెడ్‌ప్లస్ భద్రతతో, బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంలో తిరుగుతూ.. స్టార్ హోటల్స్‌లో జల్సాలు చేశాడు. చివరి వీడి నాటకాలను గుర్తించి ఇంటిలిజెన్స్.. అరెస్ట్ చేసి కటకటాల్లోకి తోసింది.
గుజరాత్‌కు చెందిన కిరణ్ పటేల్ కశ్మీర్‌కు వెళ్తూ.. అక్కడి సైనికాధికారులకు తను మోదీ కార్యాలయంలో పెద్ద ఆఫీసర్‌నని చెప్పుకుని, తన వద్ద ఉన్న ఫేక్ ఐడీలు చూపించి.. కశ్మీర్ మొత్తం కలియతిరిగాడు. అతన్ని బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంతో పాటు జెడ్‌ప్లస్ భద్రత కూడా ఇచ్చారు అక్కడి అధికారులు. ఈ వ్యక్తి శ్రీనగర్‌లో రెండు సార్లు అధికారులతో సమావేశం కూడా నిర్వహించాడు. తొలి సారి కశ్మీర్ వెళ్లినప్పుడు దక్షిణ కశ్మీర్‌లోని యాపిల్ తోటల కోసం కొనుగోలుదారులను గుర్తించాలని ప్రభుత్వం తనను కోరిందని పటేల్ పేర్కొన్నారు. మరొక పర్యటనలో ప్రముఖ స్కీయింగ్ గమ్యస్థానమైన గుల్మార్గ్‌కు వెళ్లి.. ఆ ప్రాంతంలో హోటల్ సౌకర్యాలను మెరుగుపరచాలని ప్రభుత్వం తనకు సూచించిందని నమ్మబలికాడు.
ఆ పర్యటనల సమయంలో అధికారికంగా ఫైవ్ స్టార్ హోటల్స్‌లో బస చేశాడు కిరణ్ పటేల్. రెండోసారి కశ్మీర్ పర్యటనకు వెళ్లినప్పుడు ఇంటలిజెన్స్ అందించిన సమాచారంతో శ్రీనగర్ పోలీసులు పటేల్‌ను అదుపులోకి తీసుకున్నారు. పటేల్ వద్ద నకిలీ గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రయోజనాలతో పాటు, ఇతర సదుపాయాలను వాడుకునేందుకు పటేల్ ప్రయత్నించారని పోలీసులు కేసు నమోదు చేశారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
This is Kiran Patel, a Gujarati conman. He visited Kashmir posing as a high ranked PMO officer, he was provided a Z security cover, a 5 star stay at The Lalit Srinagar and also held several key meetings for months.
The consistency of Gujarat in producing frauds is amazing 🙌 pic.twitter.com/ViV5UTh6bC
— Rofl Gandhi 2.0 🏹 (@RoflGandhi_) March 17, 2023