పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ఇంట్లో దొంగతనం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు అక్మల్ ఇంట్లో ఒక మేకను ఎత్తుకెళ్లారు. ఆ మేక విలువ సుమారు రూ.90 వేలు ఉంటుందని సమాచారం. బక్రీద్ పండుగ సందర్భంగా పేదలకు దానం ఇచ్చేందుకు కమ్రాన్ కొన్ని మేకలను కొనుగోలు చేశాడు. అందులో ఒక బలిష్టమైన మేకను దొంగలు ఎత్తుకెళ్లినట్లు కమ్రాన్ తండ్రి శుక్రవారం వెల్లడించారు.
లాహోర్‌లోని ఓ రెసిడెన్సియల్ సొసైటీలో అక్మల్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని మొత్తం ఆరు మేకలను కొనుగోలు చేసి, ఈ తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఇంటి ఆవరణలో కట్టేశామని, అందులో ఒకటి కనిపించట్లేదని అన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. సాధారణంగా బక్రీద్ సమయంలో ముస్లింలు.. ఖుర్బానీ ఇవ్వడానికి మేకలు, గొర్రెలను కొనుగోలు చేస్తుంటారు. ప్రత్యేకంగా ఈ ఖుర్బానీ కోసమే వాటిని మేపుతుంటారు. అందుకే వాటికి డిమాండ్ ఎక్కువ. ఈ పండుగ సమయంలో ఖుర్బానీ మేకలు, గొర్రెలు, పొట్టేళ్ల ధర చాలా ఎక్కువ ఉంటుంది. 6 మేకలు కొనేందుకు అక్మల్ రూ.6 లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.
కాగా. కమ్రాన్ అక్మల్ పాకిస్థాన్ తరఫున అన్ని ఫార్మట్ల క్రికెట్ ఆడాడు. 53 టెస్టులు, 157 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌ల్లో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్‌గా కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం డొమెస్టిక్ లీగ్ మ్యాచ్‌ల్లో ఆడుతున్నాడు. ఐపీఎల్ 2008 ప్రారంభ సీజన్‌లో అక్మల్ రాజస్థాన్ రాయల్స్ తరపున ఆరు మ్యాచ్‌లు ఆడాడు. వాటిలో ఒక అర్ధసెంచరీ సహా 128 పరుగులు చేశాడు. మరి కమ్రాన్ అక్మల్ ఇంట్లో చోరీ జరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Pakistani cricketer Kamran Akmal’s sacrificial animal was stolen from outside of his house on Thursday night in Lahore. pic.twitter.com/GH3ldMYFVp
— The South Asia Times (@thesouthasiatim) July 8, 2022