టీ20 వరల్డ్ కప్ ముందు డిపెండింగ్ చాంపియన్ అయిన ఆస్ట్రేలియాకు ఘోర పరాభవం ఎదురైంది. ఇంగ్లాండ్ తో జరిగిన మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను 2-0తో ఇంగ్లాండ్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చివరిదైన మూడో టీ20లో వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను పలు సార్లు వాయిదా వేస్తూ.. వచ్చారు. మ్యాచ్ ను 12 ఓవర్లకు కుదించగా.. ఇంగ్లాండ్ బ్యాటింగ్ అనంతరం 3 ఓవర్లు ఆసిస్ బ్యాటింగ్ చేయగా.. మరోసారి వర్షం రావడంతో మ్యాచ్ ను రద్దు చేశారు. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టుకు మంచి స్కోరును అందించాడు. ఈ క్రమంలోనే ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ అయిన ఆసిస్ పేసర్ హెజిల్ వుడ్ కు చుక్కలు చూపించాడు. అతడి ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో సహా 22 పరుగులు పిండుకున్నాడు.
జోస్ బట్లర్.. సమకాలీన క్రికెట్ ప్రపంచంలో అత్యంత నాణ్యమైన ఆటగాడిగా పేరుగాంచాడు. క్రమం తప్పకుండా బ్యాట్ తో రాణిస్తూ.. జట్టుకు వెన్నముకగా నిలవడమే కాకుండా విజయాలను సైతం అందిస్తున్నాడు. ఈక్రమంలోనే తాజాగా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 సిరీస్ ను 2-0 తో బ్రిటీస్ జట్టు కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయినప్పటికీ.. ఈ మ్యాచ్ లో బట్లర్ ఆసిస్ బౌలర్ హెజిల్ వుడ్ కు ఓ పీడకలనే మిగిల్చాడు. టాస్ గెలిచి మెుదట ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు హెజిల్ వుడ్ మంచి ఆరంభాన్నే ఇచ్చాడు. రెండో ఓవర్లోనే మంచి ఫామ్ లో ఉన్న హేల్స్ ను అవుట్ చేశాడు. కానీ వారి ఆనందాన్ని ఎంతో సేపు ఉంచలేదు బట్లర్. భారీ షాట్లతో ఆసిస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇక ఇన్నింగ్స్ పదవ ఓవర్లో బౌలింగ్ కు దిగిన వరల్డ్ టాప్ బౌలర్ హెజిల్ వుడ్ కు ఆ ఓవర్ పీడకలగా మిగిల్చాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేయడానికి వచ్చిన వుడ్.. కు హ్యాట్రిక్ బౌండరీలతో వెల్ కమ్ చెప్పాడు. ఈ క్రమంలోనే టీ20ల్లో తన 17వ అర్దశతకాన్ని నమోదు చేసుకున్నాడు.
అనంతరం రెండు బాల్స్ లో రెండు డబుల్స్ తీశాడు. ఇక చివరి బంతిని స్వ్కేయర్ లెగ్ లో అద్భుతమైన సిక్స్ గా మలిచాడు. దాంతో ఈ ఓవర్లో 4,4,4,2,2,6 కలిపి మెుత్తం 22 పరుగులు సమర్పించుకున్నాడు హెజిల్ వుడ్. భారత్ తో టీ20 సిరీస్ లో సైతం రోహిత్ శర్మ ఈ వరల్డ్ క్లాస్ బౌలర్ ను ఊచకోత కోసిన సంగతి తెలిసిందే. దాంతో తర్వాత ఓవర్ వేయడానికే వుడ్ బయపడ్డాడు. ప్రస్తుతం మరోసారి తన బౌలింగ్ బలహీనతను బయటపెట్టుకున్నాడు వుడ్. ఇక హెజిల్ వుడ్ బౌలింగ్ ను చూస్తున్న క్రికెట్ అభిమానులు..”ఇంతగనం కొట్టించుకుంటున్నావ్ నువ్వెలా నెంబర్ వన్ బౌలర్ అయ్యావ్ సామీ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో 12 ఓవర్లలో 2వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్ 112 పరుగులు చేసింది. జట్టులో కెప్టెన్ జాస్ బట్లరు 41 బంతుల్లో 7 ఫొర్లు, 1 సిక్స్ తో 65 పరుగులు చేశాడు. అనంతరం 3.5 ఓవర్లలో ఆసిస్ 3 వికెట్లు కోల్పోయి 30 రన్స్ చేసిన క్రమంలో వర్షం రావడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.