న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ 2022లో భాగంగా జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ ను ఇంగ్లాండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. జానీ బెయిర్‌స్టో సంచలన శతకంతో ఇంగ్లాండ్ రెండో టెస్టులో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. డ్రాగా ముగుస్తుంది అనుకున్న మ్యాచ్ ను బెయిర్‌స్టో ఒంటిచేత్తో గెలిపించాడు. ఐదో రోజు గెలుపుకోసం ఇంగ్లాండ్ కు 74.3 ఓవర్లలో 299 పరుగులు కావాల్సి ఉంది. బెయిర్ స్టో(92 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లు) 136 పరుగులు, బెన్ స్టోక్స్(70 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు) 75 నాటౌట్ గా నిలిచి కీలక మ్యాచ్ లో న్యూజిలాండ్ పై అద్భుత విజయాన్ని నమోదు చేశారు.
ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 553 పరుగుల భారీ స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ప్లేయర్లు కూడా 539 పరుగులతో విజృంభిచడం కివీస్ కి కేవలం 14 పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకు కివీస్ బ్యాట్స్ మన్లు కేవలం 284 పరుగులకే ఆలౌట్ అయ్యారు. 299 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగిన ఇంగ్లాండ్ ప్రేయర్లు.. తొలుత ట్రెంట్ బౌల్ట్(3/94) దాటికి మ్యాచ్ ను డ్రా చేసుకునేందుకు ప్రయత్నిస్తారని బావించారు.
Jonny Bairstow, an innings of a lifetime, one of the best counter-attacking 4th innings you will ever see.Well done England , Test Cricket is Best Cricket. #ENGvNZ pic.twitter.com/BV5dVzbIqk
— Virender Sehwag (@virendersehwag) June 14, 2022
ఒక దశలో 93/4తో నిలవడంతో ఇంగ్లాండ్ మ్యాచ్ ఓటమిపాలవుతుందని కూడా భావించారు. కానీ, బెయిర్‌స్టో టీ20 మ్యాచ్ తరహాలో వీరవిహారం చేయడం, బెన్ స్టోక్స్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో ఆట స్వరూపమే మారిపోయింది. బెయిర్‌స్టో- బెన్ స్టోక్స్ ఇద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 121 బంతుల్లో 179 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. వీరి పోరాటంతో ఓటమి అంచుల నుంచి ఇంగ్లాండ్ విజయతీరాలు చేరుకుంది. టెస్టును టీ20లా ఆడిన జానీ బెయిర్ స్టో ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Incredible.
Scorecard & Videos: https://t.co/ffFnHnaIPX
🏴 #ENGvNZ 🇳🇿 | @IGcom pic.twitter.com/c5yWB9CXw4
— England Cricket (@englandcricket) June 14, 2022