చేత్తో పట్టుకోకుండా బ్యాట్‌ను నిటారుగా నిలబెట్టినా, బౌలర్ బట్టతలపై బాల్‌ను రుద్దినా.. జో రూట్ స్టైలే వేరు. తాజాగా మరో విచిత్రమైన పని చేసిన రూట్ మరోసారి టాక్ ఆఫ్‌ది క్రికెట్ టౌన్‌గా మారిపోయాడు. ప్రస్తుతం ఇంగ్లండ్-పాకిస్థాన్ మధ్య టెస్టు సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. రావాల్పిండి వేదికగా తొలి టెస్టు ఐదో రోజు మ్యాచ్ ఇంట్రస్టింగ్‌గా సాగుతోంది. అయితే.. మ్యాచ్ నాలుగో రోజు రూట్ చేసిన పని పాకిస్థాన్ పరువును మట్టిగలిపింది. అంతర్జాతీయ మ్యాచ్.. అందులోనూ 17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై జరుగుతున్న హిస్టారిక్ మ్యాచ్ అయినా.. కూడా రూట్ పాక్ బౌలర్లు చాలా సిల్లీగా తీసుకున్నాడు. గల్లీ క్రికెడ్ ఆడుతున్నట్లు.. బ్యాటింగ్ చేస్తూ.. మధ్యలో లెఫ్ట్ హ్యాండర్‌గా మారిపోయాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన రూట్.. ఏదో బాల్ పడేముందు లెఫ్ట్ హ్యాండర్‌గా రివర్స్ హిట్ ఆడలేదు. బాల్ వేయకముందే లెఫ్ట్ హ్యాండర్‌గా నిలబడ్డాడు.
తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్‌లో తడబడింది. 7 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ ఇచ్చి పాకిస్థాన్‌కు 342 టార్గెట్ ఇచ్చింది. అయితే అంతకు ముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా జో రూట్ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. దీంతో రూట్‌ను అవుట్ చేసేందుకు పాక్ కెప్టెన్ బాబర్ అజమ్.. లెగ్ స్పిన్నర్ జాహిద్ మహమూద్‌ను రంగంలోకి దింపాడు. రైట్ హ్యాండర్ అయిన రూట్ లెగ్ స్పిన్నర్లను ఆడేందుకు కాస్త ఇబ్బంది పడతాడు. దీంతో.. అతని బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఏకంగా లెఫ్ట్ హ్యాండర్ అవతారం ఎత్తాడు. 52 పరుగుల వ్యక్తి స్కోర్ వద్ద ఉన్న సమయంలో మహమూద్ వేస్తున్న తన 6వ ఓవర్ రెండో బంతిని రూట్ లెఫ్ట్ హ్యాండర్‌గా ఎందుర్కొన్నాడు. అప్పటికి ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. కాగా.. లెఫ్ట్ హ్యాండర్లకు అయితే లెగ్ స్పిన్నర్లను కాస్త ఈజీ అవుతుంది. బాల్ ప్యాడ్లపైకి వస్తుంది. అయితే రూట్ తీసుకున్న ఈ నిర్ణయంతో అంతా షాక్ అయ్యారు. కీలక మ్యాచ్‌లో అందులోనూ ఎంతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడుతూ.. ఇలాంటి రిస్క్ తీసుకున్నాడేంటని ఆశ్చర్యపోయారు.
కానీ.. రూట్ మాత్రం ఎంతో సులువుగా జాహిద్ మహమూద్ బౌలింగ్‌లో లెఫ్ట్ హ్యాండ్ ఆడి మిడ్ వికెట్ వైపు స్వీప్ షాట్ ఆడాడు. అది కాస్త ఫీల్డర్ నసీమ్ షా చేతుల్లోకి వెళ్లినా.. అతను క్యాచ్‌ను జారవిడువడంతో రూట్ బతికిపోయాడు. అయితే.. కొంతసేపటికే 73 పరుగులు చేసిన రూట్.. మహమూద్ బౌలింగ్‌లోనే అవుట్ అయి పెవిలియన్ చేరాడు. అయితే.. రూట్ లెఫ్ట్ హ్యాండ్ ఆడటంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రూట్ అంత ఈజీగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేశాడంటేనే రావాల్పిండి పిచ్ ఎంత నిర్జీవంగా ఉందో అర్థమవుతుందని క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. బ్యాటర్లకు మరీ ఇంత ఈజీ పిచ్‌ను తయారుచేసి పాక్ పరువు తీసుకుందని, వారి ఫెల్యూర్‌ను రూట్ లెఫ్ట్ హ్యాండ్ ఆడిమరీ ఎత్తి చూపించాడని అంటున్నారు. కాగా.. ప్రస్తుతం ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలుపుదిశగా సాగుతోంది. మ్యాచ్ గెలిచేందుకు పాక్ ఇంకా 174 పరుగులు చేయాలి. చేతిలో 7 వికెట్లు, సగం రోజు సమయం మిగిలి ఉంది.
Joe Root decides to bat left-handed 😳#PAKvENG | #UKSePK pic.twitter.com/GOvnkof54B
— Pakistan Cricket (@TheRealPCB) December 4, 2022
Itni beizzati ke baad Ramiz Raja ko step down kar dena chahiye 😹😭 https://t.co/3O7u6HEhMR
— Silly Point (@FarziCricketer) December 4, 2022